Director Vassishta Shares Vishwambhara Set Photo with Hanuman Idol Photo goes Viral
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ, మైథలాజి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రిష ఇందులో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో బీర్ ఫ్యాక్టరీ సెట్ వేసి ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు.
ప్రస్తుతం విశ్వంభర హైదరాబాద్ ముచ్చింతల్ లో వేసిన సెట్ లో యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతుంది. ఓ భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు ఈ సెట్లో. నిన్న పవన్ కళ్యాణ్, నాగబాబు విశ్వంభర సెట్స్ కి వెళ్లి చిరంజీవిని కలవగా ఆ ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఫోటోలు దిగడంతో అవి వైరల్ గా మారాయి. ఇక ఇదే మంచి టైం అనుకున్నాడేమో డైరెక్టర్ వశిష్ట విశ్వంభర సినిమాపై అంచనాలు పెంచేలా ఓ పోస్ట్ చేసాడు.
Also Read : Ram Charan – Allu Arjun : అల్లు అర్జున్, అయాన్‌లతో రామ్ చరణ్ స్పెషల్ సెల్ఫీ.. బన్నీ బర్త్ డే స్పెషల్ ఫొటో..
ఆంజనేయస్వామి విగ్రహం ముందు కత్తులు, ఆయుధాలు అన్ని గాల్లోకి ఎగరేసి భారీ యాక్షన్ ఉండబోతుంది అన్నట్టు ఓ ఫొటో తీశారు. ఆ ఫోటోని డైరెక్టర్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ధర్మ యుద్ధం మొదలు!!! విశ్వంభర విజృంభణం.. అని పోస్ట్ చేశాడు. దీంతో అక్కడ వచ్చే యాక్షన్ సీన్ భారీగా ఉంటుందని అర్థమైపోతుంది. ఈ ఒక్క ఫొటోతో సినిమాపై భారీ అంచనాలను పెంచేసాడు డైరెక్టర్. మెగా ఫ్యాన్స్ విశ్వంభర సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కానుంది.
ధర్మ యుద్ధం మొదలు!!! విశ్వంభర విజృంభణం ??? pic.twitter.com/7g1CcajjLU
— Vassishta (@DirVassishta) April 8, 2024