Ram Charan – Allu Arjun : అల్లు అర్జున్, అయాన్‌లతో రామ్ చరణ్ స్పెషల్ సెల్ఫీ.. బన్నీ బర్త్ డే స్పెషల్ ఫొటో..

రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ ఫొటో షేర్ చేసి బన్నీకి బర్త్ డే విషెష్ తెలిపారు. ఈ ఫొటోలో అల్లు అర్జున్ తో పాటు అల్లు అయాన్ కూడా ఉన్నాడు.

Ram Charan – Allu Arjun : అల్లు అర్జున్, అయాన్‌లతో రామ్ చరణ్ స్పెషల్ సెల్ఫీ.. బన్నీ బర్త్ డే స్పెషల్ ఫొటో..

Ram Charan Shares Special Photo with Allu Arjun and Allu Ayaan on Bunny Birthday Photo goes Viral

Updated On : April 9, 2024 / 10:23 AM IST

Ram Charan – Allu Arjun : నిన్న ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రముఖులు, నెటిజన్లు నిన్నంతా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ కూడా రిలీజ్ చేసి అభిమానులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. బన్నీ బర్త్ డేని అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ తో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ ఫొటో షేర్ చేసి బన్నీకి బర్త్ డే విషెష్ తెలిపారు. ఈ ఫొటోలో అల్లు అర్జున్ తో పాటు అల్లు అయాన్ కూడా ఉన్నాడు. ఈ ఫొటోలో రామ్ చరణ్, అల్లు అయాన్ లతో అల్లు అర్జున్ సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఈ ఫొటో ఎక్కడా బయటపెట్టలేదు. ఏదో మెగా ఫ్యామిలీ ఈవెంట్లో ఈ ఫోటో తీసినట్టు తెలుస్తుంది.

Also Read : Trivikram : ఈ ఉగాది ‘దేవర’ నామ సంవత్సరం.. ‘దేవర’ 1000 కోట్లు కొట్టాలని ఆశీర్వదిస్తున్నా..

బావ, అల్లుడుతో దిగిన ఫొటో రామ్ చరణ్ పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. బన్నీ, చరణ్ అభిమానులు ఈ ఫోటో చూసి సంతోషిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా వస్తే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ బర్త్ డేకి అల్లు అర్జున్ కూడా చరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్ వేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ కజిన్ అని కామెంట్ చేసాడు. మొత్తానికి బావబామ్మర్దుల బంధం గట్టిదే అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)