×
Ad

Arasan: వెట్రిమారన్ సినిమాటిక్ యూనివర్స్.. శింబు హీరోగా ‘అరసన్’ మూవీ.. అంటే అర్థం ఏంటో తెలుసా?

తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలకు ఆడియన్స్ లో మంచి డిమాండ్ ఉంది. (Arasan)ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి.

Director Vetrimaaran started the movie Arasan with hero Simbu

Arasan: తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలకు ఆడియన్స్ లో మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే, నేషనల్ అవార్డు అందుకున్న ఈ దర్శకుడితో పని చేయాలనీ చాలా మంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. తాజాగా ఈ దర్శకుడు మరో కొత్త సినిమాను ప్రకటించాడు. అదే ‘అరసన్’. అరసన్ అంటే రాజు అని అర్థం. తమిళ స్టార్ శింబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు(Arasan). అక్టోబర్ 7వ తేదీన ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో, ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

Adivi Sesh: శేష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పేలా లేదు.. కనీసం ఈసారైనా..

చీకట్లో కట్టిపట్టుకొని సైకిల్ పక్కన నిల్చున్న శింబు లుక్ ఆసక్తిని కలిగిస్తోంది. చాలా ఇంటెన్స్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, దర్శకుడు వెట్రిమాన్ తన సొంత సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశారు. అందులో భాగంగానే అరసన్ సినిమాను తన సూపర్ హిట్ సినిమా వడ చెన్నై లో భాగంగా తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక వెట్రిమారన్ స్టైల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ లేదా శ్రీలీల హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. వీ క్రియేషన్స్ బ్యానర్ పై కలై పులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.