Adivi Sesh: శేష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పేలా లేదు.. కనీసం ఈసారైనా..
మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్(Adivi Sesh). ఈ సినిమా విడుదలై మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేయలేదు.

Adivi Sesh Decoit movie postponed once again sn
Adivi Sesh: మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. ఈ సినిమా విడుదలై మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు ఒకే చేశాడు. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న గూఢచారి 2 కాగా, రెండవది డెకాయిట్. రెండేళ్ల క్రితమే ఈ రెండు సినిమాలు షూటింగ్ మొదలయినప్పటికీ విడుదలపై(Adivi Sesh) ఇంకా క్లారిటీ రావడంలేదు. ఇందులో, గూఢచారి 2 విషయం కాస్త పక్కన పెడితే.. డెకాయిట్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది.
క్రైం థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాను శనియేల్ డియో తెరకెక్కిస్తుండగా సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అనూన్స్ మెంట్ నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, పోస్టర్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ముందుగా 2025 డిసెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
కారణం ఏంటంటే, రోషన్ హీరోగా వస్తున్న ఛాంపియన్ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే, డెకాయిట్ సినిమాకి సంబందించిన కొంత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తవలేదట. దాంతో, ఈ రిలీజ్ డేట్ ను ఛాంపియన్ సినిమా కోసం త్యాగం చేశారట. దీంతో, అడివి శేష్ సినిమా కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆయన ఫ్యాన్స్ కి మరోసారి నిరాశే ఎదురయ్యింది. ఇక ఈ సినిమా కొత్త విడుదల తేదీ గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.