Nithin: హిట్ కోసం ఓజీని టార్గెట్ చేసిన నితిన్.. గట్టిగా వాడడానికి ఫిక్స్ అయ్యాడట.. ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా?

యూత్ స్టార్ నితిన్ టైం అస్సలు బాలేదనే చెప్పాలి. ఈమధ్య ఆయన చేసిన చేసిన(Nithin) సినిమాలన్నీ ప్లాప్స్ కాదు డిజాస్టర్స్ అవుతున్నాయి.

Nithin: హిట్ కోసం ఓజీని టార్గెట్ చేసిన నితిన్.. గట్టిగా వాడడానికి ఫిక్స్ అయ్యాడట.. ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా?

Hero Nithin next movie title is Gambheera.

Updated On : October 7, 2025 / 2:50 PM IST

Nithin: యూత్ స్టార్ నితిన్ టైం అస్సలు బాలేదనే చెప్పాలి. ఈమధ్య ఆయన చేసిన చేసిన సినిమాలన్నీ ప్లాప్స్ కాదు డిజాస్టర్స్ అవుతున్నాయి. మధ్యలో వచ్చిన భీష్మ తప్ప ఒక్క సినిమా కూడా హిట్ కాదు కదా.. కనీసం యావరేజ్ కూడా అవలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్రివిక్రమ్ తో చేసిన ‘అఆ’ చెప్పుకోదగ్గ ఒక్క సినిమా కూడా లేదు. ఈ సినిమా తరువాత వరుసగా లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం, చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజక వర్గం, ఎక్స్ట్రా, రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి సినిమాలు చేశాడు. దాదాపు 9 ఏళ్లలో పదికి పైగా సినిమాల్లో నటించిన నితిన్ ఒక్క హిట్ కూడా (Nithin)సాధించలేదు.

Vijay Devarakonda: ఎంగేజ్మెంట్ రింగ్తో విజయ్ దేవరకొండ.. ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు.. చెప్పకనే చెప్పేశాడుగా

దాంతో నితిన్ కెరీర్ ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. ఇప్పుడు ఆయనకు అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. అందుకే, మరోసారి తన ఫేవరేటే హీరో సెంటిమెంట్ ను వాడటానికి సిద్ధం అవుతున్నాడట. నితిన్ కి ఫేవరేటే హీరో ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ విషయాన్నీ చాలాసార్లు ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు నితిన్. అందుకే, ఆయనతాలూకు రిఫరెన్స్ లను కూడా అప్పుడప్పుడు వాడుతూనే ఉంటాడు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ పాటలను రీమిక్స్ చేయడం, ఆయన సినిమా టైటిల్స్ ను తన సినిమాకు పెట్టుకోవడం చేస్తూనే ఉంటాడు. తాజాగా, ఆ సెంటిమెంట్ ను మరోసారి వాడుతున్నాడట.

ఈసారి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీర) ని టార్గెట్ చేశాడట. తన నెక్స్ట్ సినిమాకు ‘గంభీర’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నాడట. ఇటీవల సినిమాను ఒకే చేశాడట నితిన్. యాక్షన్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు కథా పరంగా గంభీర అనే టైటిల్ అయితేనే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అలాగే పవన్ సెంటిమెంట్ కేసుల వర్కౌట్ అవుతుందని అలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో అయినా నితిన్ హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.