Vijaya Bhaskar
Vijaya Bhaskar : వెంకటేష్ కెరీర్లో సూపర్ హిట్ క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందించి రచయితగా పనిచేసారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఇప్పుడు జనవరి 1న రీ రిలీజ్ అవుతుంది.(Vijaya Bhaskar)
అయితే ఈ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో నిర్మాత స్రవంతి రవికిశోర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాత్రమే కనిపిస్తున్నారు. రవికిశోర్, త్రివిక్రమ్ కలిసి అప్పటి సంగతులు అంటూ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసారు. నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఎక్కడా కనపడకపోవడం గమనార్హం.
Also Read : Anvesh : యూట్యూబర్ అన్వేష్ కి షాక్.. పోలీస్ స్టేషన్ లలో వరుస ఫిర్యాదులు..
విజయ్ భాస్కర్ స్వయంవరం, నువ్వే కావలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ, ప్రేమ కావాలి.. లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించారు. వీటిలో చాలా సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేసారు. కానీ విజయ్ భాస్కర్ గత కొన్నాళ్ళుగా ఫ్లాప్స్ లోనే ఉన్నారు. ఆయన చివరి సినిమాలు మసాలా, జిలేబి, ఉషా పరిణయం.. ఫ్లాప్స్ గానే మిగిలాయి.
దీంతో విజయ్ భాస్కర్ ఎక్కువగా యాక్టివ్ గా ఉండట్లేదు. నువ్వు నాకు నచ్చావ్ సినిమా రీ రిలీజ్ లో ఈ డైరెక్టర్ కనిపిస్తారు అనుకున్నారు కానీ నిర్మాణ సంస్థ డైరెక్టర్ ని పక్కన పెట్టి త్రివిక్రమ్ నే ముందు పెట్టి ప్రమోషన్స్ చేయడం గమనార్హం. డైరెక్టర్ ఎక్కడా అంటూ పలువురు నెటిజన్లు ఈ టీమ్ ని ప్రశ్నిస్తున్నారు.
Also Read : Pawan Kalyan : ఆ సినిమాకు తీసుకున్న 5 కోట్లు రైతులకు ఇచ్చేసాను.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్..
త్రివిక్రమ్ – నిర్మాత చేసిన ఇంటర్వ్యూ కింద కూడా డైరెక్టర్ విజయ్ భాస్కర్ కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ పరంగా త్రివిక్రమ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కాబట్టి ఆయనతో ఇంటర్వ్యూ చేసారు. విజయ్ భాస్కర్ ఇప్పుడు ఫామ్ లో లేరు కాబట్టి పక్కన పెట్టేసారు అని టాలీవుడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. మరి విజయ్ భాస్కర్ దీనిపై ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.