Disha Encounter : హైకోర్టును ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబసభ్యులు

Disha Encounter Film : కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపేయాలని.. దిశ కేసు నిందితుల కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై.. సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్‌ను కలిశారు. దిశ ఎన్ కౌంటర్ సినిమా నిలిపేయాలని వినతిపత్రం ఇచ్చారు. దిశ కేసులో నిందితులైన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు, మహ్మద్ అరిఫ్ కుటుంబసభ్యులంతా.. కోర్టుకు వచ్చారు.
దిశ ఎన్ కౌంటర్ సినిమాలో.. తమ వాళ్లను విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. తమతో పాటు పెరుగుతున్న తమ పిల్లల మీద ఆర్జీవీ తీసే చిత్రం ప్రభావం చూపిస్తుందని.. జ్యుడీషియల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓ వైపు కేసు విచారణ జరుగుతుంటే.. దిశ కథను ఎలా సినిమా తీస్తారని ఫిర్యాదులో తెలిపారు.
https://10tv.in/central-government-send-back-disha-bill-to-ap-government/
వెంటనే.. ఆర్జీవీ దిశ ఎన్ కౌంటర్ సినిమా చిత్రీకరణను నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని నిందితుల కుటుంబసభ్యులు.. జ్యుడీషియల్ కమిషన్‌ను కోరారు. ఇప్పటికే.. దిశ తండ్రి ఈ సినిమాను నిలిపేయాలని.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరలుస్తూ..వివాదాల్లో నిలుస్తుంటారు వర్మ. ఇప్పటికే పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. 2019 నవంబర్ లో తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశపై అత్యాచారం, హత్య, ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్.. దీని ఆధారంగా ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్స్, టీజర్ విడుదల చేశారు కూడా.
కొందరు వ్యక్తులు ఓ అమ్మాయిని పాశవికంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని కాల్చేశారు. ఆ అమ్మాయిని చంపిన వారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దేశంలోనే భయానకమైన ఘటనగా దీన్ని పేర్కొన్న వర్మ, దిశా హత్య జరిగి ఏడాది అవుతుంది. నవంబర్ 26, 2019లో దిశా ఘటన జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే నవంబర్ 26, 2020న తన ‘దిశా ఎన్‌కౌంటర్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.