Disha Patani Tiger Shroff Break Up News Goes Viral
Disha Patani: బాలీవుడ్ లవ్ బర్డ్స్‌గా గతకొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు విడిపోయారంటూ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గత ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ ఇద్దరు ఎట్టకేలకు తమ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్లుగా బీటౌన్ కోడై కూస్తోంది. ఎక్కడ చూసినా ఈ ఇద్దరు జంటగా కనిపించే వారు. కానీ తాజాగా దిశా పటానీ నటిస్తున్న ‘ఏక్ విలన్ రిటర్న్స్’ మూవీ ప్రమోషన్స్‌లో అమ్మడు సోలోగా దర్శనమిస్తోంది.
Disha Patani : ప్రభాస్ తో వర్క్ కంఫర్ట్ గా ఉంటుంది.. ఆయనే వడ్డిస్తారు..
అయితే టైగర్‌కు చాలా సన్నిహితంగా ఉండే వారు చెబుతున్న వివరాల ప్రకారం ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతోనే వారిద్దరు దూరంగా ఉంటున్నారని.. ఇకపై వీరిద్దరూ కలిసి ఉండటం కష్టమే అని తెలుస్తోందట. కానీ, ఈ విషయంపై అటు దిశా కానీ, ఇటు టైగర్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇక తన సినిమా ప్రమోషన్స్‌లో టైగర్ ష్రాఫ్ గురించి మీడియా అడగ్గా, అతడంటే తనకు చాలా అభిమానం అని.. అతడితో మంచి స్నేహం ఉందని.. అతడి వల్లే తాను క్రమశిక్షణ, మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్చుకున్నట్లుగా దిశా చెప్పుకొచ్చింది.
Pushpa: ఈసారి బాలీవుడ్ భామతో ఊ అనిపిస్తోన్న పుష్ప..?
కానీ, అతడితో రిలేషన్ గురించి మాత్రం మాట దాటేసింది. దీంతో బీటౌన్‌లో వినిపిస్తున్న ముచ్చట నిజమే అని పలు బాలీవుడ్ మీడియా ఛానళ్లు వార్తలు రాస్తున్నాయి. అయితే తాము విడిపోయినట్లుగా ఎక్కడా కూడా ఈ జంట అఫీషియల్‌గా చెప్పకపోవడం గమనార్హం. మరి వీరి మధ్య ఏం జరిగింది, అసలు వీరు నిజంగానే విడిపోయారా అనే ప్రశ్నలకు వీరిద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ అప్ అయ్యే వరకు మనకీ సస్పెన్స్ తప్పదు.