Disha Patani : ప్రభాస్ తో వర్క్ కంఫర్ట్ గా ఉంటుంది.. ఆయనే వడ్డిస్తారు..

దిశా పటాని ప్రెస్ మీట్ లో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ''సెట్ లో ప్రభాస్‌ స్టార్‌ అనే విషయాన్ని పక్కన పెట్టి చాలా సింపుల్‌గా ఉంటాడని నేను గతంలో విన్నాను. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. ప్రభాస్ చాలా...............

Disha Patani : ప్రభాస్ తో వర్క్ కంఫర్ట్ గా ఉంటుంది.. ఆయనే వడ్డిస్తారు..

Prabhas

Prabhas : బాలీవుడ్ భామ దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దిశా ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో విలేఖరులు ప్రభాస్ గురించి అడగగా దిశా చాలా గొప్పగా చెప్పింది. ఇక ప్రభాస్ తనతో కలిసి పని చేసే వాళ్ళకి తన ఇంటి నుంచి భోజనం తెప్పించి పెడతారని తెలిసిందే. దిశా దాని గురించి కూడా మాట్లాడింది.

Koffee with Karan : విజయ్ దేవరకొండ లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశాడో అనన్య పాండేకి తెలుసంట.. బాబోయ్ ఈ ప్రోమో చూస్తే..

దిశా పటాని ప్రెస్ మీట్ లో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ”సెట్ లో ప్రభాస్‌ స్టార్‌ అనే విషయాన్ని పక్కన పెట్టి చాలా సింపుల్‌గా ఉంటాడని నేను గతంలో విన్నాను. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటుల్లో ప్రభాస్ ఒకరు. అందరూ చెప్పినట్టే ఆయన ఇంటి నుంచి తెప్పించిన భోజనాన్ని స్వయంగా వడ్డిస్తాడు. నాకే కాదు టీం మొత్తానికి ఆయన భోజనం తెప్పించారు చాలా సార్లు. ప్రభాస్ అందరితో ప్రేమగా ఉంటారు. ఆయన చూపించే ప్రేమను అంత ఈజీగా మరచిపోలేము. నేనైతే అలాంటి హీరోను ఇప్పటివరకు చూడలేదు. ప్రభాస్ తో కలిసి నటించడం చాలా సులభం” అని చెప్పింది. ప్రభాస్ పై దిశా ఇంత గొప్పగా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవ్వగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.