Save The Tigers 2 : ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ చూశారా? ఈ సారి మరింత కామెడీ..

తాజాగా సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు.

Disney Plus Hotstar Telugu Series Save The Tigers Season 2 Trailer Released

Save The Tigers 2 Trailer : డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ‘సేవ్ ద టైగర్స్’ అనే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ గత సంవత్సరం ఏప్రిల్ లో వచ్చి మంచి విజయం సాధించింది. ఆరు ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులని నవ్వించి మెప్పించింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని.. కపుల్స్ గా ప్రధాన పాత్రల్లో, శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, రోహిణి.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మాణంలో తేజ కాకుమాను దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది.

Also Read : NTR 31 : భార్యతో కలిసి బెంగుళూరులో ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌, రిషబ్ శెట్టిలతో ముచ్చట్లు.. ఎన్టీఆర్ 31 గురించేనా?

గత సంవత్సరం సీజన్ 1 సక్సెస్ అవ్వడంతో అప్పుడే సీజన్ 2 ఉంటుందని ప్రకటించారు. త్వరలోనే మార్చ్ 15 నుంచి సేవ్ ద టైగర్స్ సీజన్ 2 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఫుల్ కామెడీతో నవ్వించారు. దీంతో ఈసారి కూడా సేవ్ ద టైగర్స్ 2 సిరీస్ ఫుల్ గా ప్రేక్షకులని నవ్వించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సారి సేవ్ ద టైగర్స్ లో హీరోయిన్ సీరత్ కపూర్ ఓ ముఖ్య పాత్ర చేసింది.