Divvela Madhuri
Divvela Madhuri : దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇప్పుడు ఫాలోయింగ్ కూడా బాగుంది. దివ్వెల మాధురి అయితే బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చింది. మాధురి బిగ్ బాస్ కి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ బయట ఉండి ప్రమోషన్స్ చేసి ఫుల్ సపోర్ట్ చేసారు. ఈ జంట రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వార్తల్లో నిలుస్తుంది.(Divvela Madhuri)
తాజగా దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట మరోసారి చర్చల్లో నిలిచింది. వీళ్ళిద్దరూ ఓ సినిమాలో కనిపించబోతున్నారు. ఆల్రెడీ గతంలో వాలంటీర్ అనే ఓ చిన్న సినిమాలో కనిపించారు. ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రియదర్శి, ఆనంది జంటగా తెరకెక్కిన ప్రేమంటే సినిమా నవంబర్ 21న రిలీజ్ కానుంది. యాంకర్ సుమ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.
Also Read : I Bomma Ravi : ఓర్నీ.. ఐ బొమ్మ రవి పై బయోపిక్.. ఇదెక్కడి ప్లాన్..
అయితే ఈ సినిమాలో దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి కూడా నటించారట . ఓ చిన్న క్యామియో రోల్ లో ఈ ఇద్దరూ కనిపించనున్నారట. మరి సినిమాలో వీళ్ళు ఎలా నటించారో, ఏ పాత్రల్లో కనిపించారో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే. ఇది కనక కొంచెం క్లిక్ అయినా ఈ ఇద్దరికీ మున్ముందు మరిన్ని సినిమా ఆఫర్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. దువ్వాడ – దివ్వెల ఫాలోవర్స్ మాత్రం ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.