Divyendu Sharma birthday special poster from peddi movie
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆయన పట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఓ విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను పంచుకుంది.
క్రికెట్ బాల్ పట్టుకుని బౌలింగ్ చేసేందుకు సిద్ధం అయినట్లుగా దివ్యేందు శర్మ కనిపిస్తున్నాడు. ఆయన లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Team #Peddi wishes its ‘RamBujji’ aka the supremely talented @divyenndu a very Happy Birthday ❤🔥
‘RamBujji’ will be one the most interesting characters from the raw & rustic world of #Peddi 💥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026 💥💥
Global Star @AlwaysRamCharan… pic.twitter.com/Cnd2gtSGlo
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 19, 2025
ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.