Diwali Theatrical Releasing Movies List
Diwali Movies : దసరా తర్వాత రెండు వారాల పాటు సరైన పెద్ద సినిమాలు లేవు. గత వారం కీడాకోలా, పొలిమేర 2, నరకాసుర లాంటి మీడియం సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. ఇక ఈ వారం దీపావళి ఉండటంతో మూడు డబ్బింగ్ సినిమాలు పెద్దవే రిలీజ్ కానున్నాయి. తెలుగు సినిమాలు ఏవి ఈ వారం లేకపోవడం గమనార్హం.
2014లో సిద్దార్ధ, బాబీ సింహ, లక్ష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తమిళ సినిమా ‘జిగర్‌తండా’. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఇప్పుడు దీనికి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ప్రీక్వెల్ ని తీసుకు వస్తున్నాడు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రీక్వెల్ కి ‘జిగర్‌తండా డబుల్ ఎక్స్’(Jigarthanda Double X) అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ చేయనున్నారు.
హీరో కార్తి తన 25వ చిత్రంగా ‘జపాన్’(Japan) సినిమాతో రాబోతున్నాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో హైస్ట్ థ్రిల్లర్ గా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాని తెరకెక్కించారు. అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. జపాన్ సినిమా కూడా దీపావళి కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.
Also Read : Siri Hanumanthu : జబర్దస్త్‌కి మళ్ళీ కొత్త యాంకర్.. యాంకర్‌గా మారిన నటి..
పఠాన్(Pathan) లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న స్పై మూవీ సల్మాన్ ఖాన్(Salman Khan) టైగర్ 3(Tiger 3). YRF స్పై యూనివర్స్ లోనే ఈ సినిమా ఉండబోతుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది. టైగర్ 3 సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 12 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
వీటితో పాటు ‘అలా నిన్ను చేరి’ అనే చిన్న సినిమా నవంబర్ 10న దీపావళి అనే మరో డబ్బింగ్ చిన్న సినిమా నవంబర్ 11న, హాలీవుడ్ మూవీ ది మార్వెల్స్ డబ్బింగ్ లో నవంబర్ 10న రిలీజ్ కానున్నాయి.