Siri Hanumanthu : జబర్దస్త్‌కి మళ్ళీ కొత్త యాంకర్.. యాంకర్‌గా మారిన నటి..

త సంవత్సర కాలంగా సౌమ్య జబర్దస్త్ కి యాంకరింగ్ చేస్తుంది. ఇపుడు పలు కారణాలతో సౌమ్య జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం.

Siri Hanumanthu :  జబర్దస్త్‌కి మళ్ళీ కొత్త యాంకర్.. యాంకర్‌గా మారిన నటి..

Jabardasth Anchor Sowmya Rao Replaced With Siri Hanumanthu

Updated On : November 6, 2023 / 11:55 AM IST

Siri Hanumanthu : తెలుగు టెలివిజన్ లో బాగా పాపులర్ అయిన షో జబర్దస్త్(Jabardasth). ఎన్నో సంవత్సరాలుగా ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. దీనికి మంచి రేటింగ్ రావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ని కూడా మొదలు పెట్టారు. ఈ షోల ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. గత కొంతకాలంగా ఈ షోల నుంచి కమెడియన్లు, జడ్జీలు చాలామంది వెళ్లిపోయారు. ఇక ఈ షోలు మొదలుపెట్టిన దగ్గర్నుంచి యాంకర్స్ గా అనసూయ, రష్మీనే చేస్తున్నారు. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళిద్దరికీ కుదరనప్పుడు వర్షిణి, విష్ణు ప్రియ కొన్ని ఎపిసోడ్స్ చేశారు.

అనసూయ, రష్మీ మాత్ర తమ యాంకరింగ్, గ్లామర్ తో షోకి మరింత అందాన్ని తీసుకొచ్చి చేస్తూనే వచ్చారు. ఇటీవల అనసూయ సినిమాలతో బిజీ అవ్వడంతో జబర్దస్త్ నుంచి తప్పుకుంది. దీంతో కొన్ని రోజులు రెండు షోలకి రష్మీనే యాంకర్ గా చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ కి సీరియల్ నటి సౌమ్య రావుని కొత్త యాంకర్ గా తీసుకొచ్చారు. గత సంవత్సర కాలంగా సౌమ్య జబర్దస్త్ కి యాంకరింగ్ చేస్తుంది.

Also Read : Keerthy Suresh : బీచ్‌లో హీరోలా జీప్ నడుపుతున్న కీర్తి సురేష్.. దుమ్ము లేపుతుందిగా..

ఇపుడు పలు కారణాలతో సౌమ్య జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. దీంతో జబర్దస్త్ షోకి నటి సిరి హన్మంతుని యాంకర్ గా తీసుకొచ్చారు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సిరి హన్మంతు ఆ తర్వాత సీరియల్స్, సిరీస్ లు, బిగ్ బాస్, సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సిరి అచ్చ తెలుగమ్మాయి. చాలా కష్టపడి సొంతంగా పరిశ్రమలో ఎదిగిన అమ్మాయి. జబర్దస్త్ లో మొదటి ఎపిసోడ్ లో వైట్ డ్రెస్ తో ఏంజిల్ లా ఎంట్రీ ఇచ్చింది. దీంతో సిరి హన్మంతు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అమ్మాయి ఎన్ని రోజులు యాంకరింగ్ చేస్తుందో చూడాలి.