DJ Tillu2: డీజే టిల్లు తిరిగొచ్చేశాడు.. టైటిల్ టీజర్ రిలీజ్!
ఈ ఏడాది మొదటిలో ఎటువంటి అంచనాలు లేకుండా, చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసుల వర్షం కురిపించిన సినిమా "డీజే టిల్లు". టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ వెండితెర మీద డీజే టిల్లుగా చేసిన హంగామా అందర్నీ విపరీతంగా అలరించింది. సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో..
- gum 95921
- Published On : October 24, 2022 / 03:06 PM IST
DJ Tillu2 Title Teaser Released
DJ Tillu2: ఈ ఏడాది మొదటిలో ఎటువంటి అంచనాలు లేకుండా, చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసుల వర్షం కురిపించిన సినిమా “డీజే టిల్లు”. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ వెండితెర మీద డీజే టిల్లుగా చేసిన హంగామా అందర్నీ విపరీతంగా అలరించింది. తన డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ తెలంగాణ మాటతీరు సినిమాని సక్సెస్ దిశగా తీసుకువెళ్లాయి.
Sree Leela In For DJ Tillu 2: డీజే టిల్లు కోసం ధమాకా లాంటి బ్యూటీ..?
సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో.. దీనికి సీక్వెల్ తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు మూవీ మేకర్స్. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్, నేడు దీపావళి కానుకగా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. విడుదలైన టీజర్ లో కానిస్టేబుల్ ఫిష్ వెంకట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ లో భాగంగా టిల్లుని ప్రశ్నించగా..వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు సీక్వెల్ పై అంచనాలను పెంచేలా ఉన్నాయి.
“హీరోయిన్ గా చేయడానికి పూజ హెగ్దేకి కాలి లేదంటా అన్న అని చెప్పగా.. బొచ్చు బిజీ ఉన్నవాళ్లు మనకి వద్దు, ఆమెకు చెప్పు డైరెక్టర్ యాక్షన్ చెప్పేలోపే మనం డైలాగ్ పూర్తీ చేసేస్తాం అట్లుంది మనతోనే” వంటి మాటలతో ఈసారి డబల్ ఫన్, డబల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని తెలుస్తుంది. డీజే టిల్లు-1 తెరకెక్కించిన మల్లిక్ రామ్ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్యదేవా నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఈసారి రాధికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతుంది.
