Drinker Sai : ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న ‘డ్రింకర్ సాయి’.. ఫ్రీగా చూసేయొచ్చు..
డ్రింకర్ సాయి సినిమా ఇటీవలే జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇప్పుడు జీ5 లో ఈ సినిమా ఫ్రీగా కూడా స్ట్రీమింగ్ అవుతుంది. (Drinker Sai)
Drinker Sai
Drinker Sai : ధర్మ మహేష్, ఐశ్వర్య శర్మ జంటగా తెరకెక్కిన సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా డిసెంబర్ 27న థియేటర్స్ లో రిలీజయింది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాణంలో కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కిరాక్ సీత, రీతూ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, ఫన్ బకెట్ రాజేష్, సమీర్, భద్రం, SS కాంచి.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
లేట్ గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. డ్రింకర్ సాయి సినిమా ఇటీవలే జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇప్పుడు జీ5 లో ఈ సినిమా ఫ్రీగా కూడా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ సినిమా టాప్-1 ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎప్పుడూ మందు తాగే అబ్బాయి పాత్రలో, క్లైమాక్స్ లో హీరో ధర్మ మహేష్ ఈ సినిమాలో చాలా బాగా నటించి మెప్పించాడు. సినిమా అంతా ఆల్మోస్ట్ తన భుజాలపై మోశాడు. ఈ సినిమాకు బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా దుబాయ్‌లో గామా అవార్డ్ కూడా అందుకున్నాడు ధర్మ మహేష్. ఈ సినిమా మిస్ అయితే జీ5
ఓటీటీలో చూసేయండి..
Also Read : Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు వచ్చేస్తున్నాడు.. ‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ అనౌన్స్..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. సాయి(ధర్మ) బాగా డబ్బున్న అనాథ. తాగడం, తిరగడం అతని పని. అతన్ని, అతని ఆస్తిని చూసుకునే అంకుల్(శ్రీకాంత్ అయ్యంగార్) సాయిని మారమని ఎంత చెప్పినా వినడు. ఓ రోజు బాగా తాగి ఉన్న సాయిని భాగీ(ఐశ్వర్య శర్మ) స్కూటీతో గుద్దేసి వెళ్ళిపోతుంది. తనతో గొడవ పెట్టుకొందామని వెళ్లి ప్రేమలో పడతాడు సాయి. అప్పట్నుంచి భాగీ ప్రేమ కోసం ఆమె వెనకాలే తిరుగుతాడు కానీ మందు, సిగరెట్ మాత్రం మానేయాడు. భాగీ మొదట్నుంచి సాయిని నెగిటివ్ గా చూస్తూ అతనేమన్నా చేస్తాడేమో అనే భయంతో ప్రేమకు ఓకే చెప్తుంది. కానీ సాయి మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం, కొన్ని విషయాల్లో మిస్ అండర్ స్టాండింగ్ చేసుకోవడంతో భాగీ ఓ రోజు సాయిపై అరిచి ప్రేమకు నో చెప్పి వెళ్ళిపోతుంది. భాగీ నో చెప్పాక సాయి ఏం చేసాడు? భాగీ సాయి ప్రేమని ఒప్పుకుందా? సాయి మందు, సిగరెట్ మానేశాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
