Mechanic Rocky : ‘మెకానిక్ రాకీ’ సినిమా చూడండి.. విశ్వక్ సేన్ కార్ గెలుచుకోండి..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చివరి రెండు సినిమాలు గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా విశ్వక్ మెకానిక్ రాకీ సినిమాతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చాడు.

Do Watch the Mechanic Rocky movie and WinVishwak Sen car
Mechanic Rocky : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చివరి రెండు సినిమాలు గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా విశ్వక్ మెకానిక్ రాకీ సినిమాతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో నడుస్తుంది. విడుదలైన మొదటి రోజు నుండే మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. మీనాక్షి చౌదరీ, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తల్లూరి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read : Vishwak Sen : డాన్స్ షో లో విశ్వక్ సేన్ సందడి.. ఆదినే మించిపోయే పంచులతో..
తాజాగా ఈ సినిమా చూసే ఆడియన్స్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు విశ్వక్. ఈ సినిమాలో విశ్వక్ ఓ కార్ వాడతారు. సినిమాలో అన్ని ఫైట్ సీన్స్ కోసం అదే కార్ వాడతారు విశ్వక్. ఇక సినిమాలో విశ్వక్ వాడిన ఈ కార్ ను గెలుచుకునే అవకాశాన్ని కల్పించాడు మాస్ కా దాస్. మెకానిక్ రాకీ సినిమా చూడబోయే ఆడియన్స్ తాము టికెట్ బుక్ చేసుకున్నట్టు తమ ఫ్యామిలీ తో ఓ ఫోటో దిగి #Rockykacar అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ ఫోటో తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చెయ్యమన్నారు. అలా పోస్ట్ చేసిన వారిలో ఒకరిని ఎంపిక చేసుకొని విశ్వక్ వాడిన ఆ కార్ ను వారికి ఇస్తాడట.
ఇక ఈ విషయాన్ని తెలువుతూ విశ్వక్ సేన్ ఓ పోస్ట్ పెట్టారు. అలా విశ్వక్ పెట్టిన ఈ పోస్ట్ కి చాలా మంది ఆడియన్స్ స్పందిస్తూ టికెట్ కొని ఆ పోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పెడుతున్నారు. మరి విశ్వక్ వాడిన ఆ కార్ ఏ లక్కీ ఆడియన్ గెలుచుకుంటారో చూడాలి.