Abhishek Bachchan : ఐశ్వర్య రాయ్ తో పెళ్లి కంటే ముందు అభిషేక్.. ఇంకో స్టార్ హీరోయిన్ తో నిశితార్థం.. ఆ విషయం తెలుసా?

ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి కంటే ముందు అభిషేక్ బచ్చన్ ఇంకో స్టార్ హీరోయిన్ ని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.

Do You Know Abhishek Bachchan Engagement with Karishma Kapoor Before Aishwarya Rai

Abhishek Bachchan : అమితాబ్ తనయుడు, బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అభిషేక్ బచ్చన్ 2007లో ఐశ్వర్య రాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి కంటే ముందు అభిషేక్ బచ్చన్ ఇంకో స్టార్ హీరోయిన్ ని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.

అభిషేక్ బచ్చన్ 2002 లో అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ ని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి హాన్ మైనే బి ప్యార్ కియా అనే సినిమాలో నటించారు. పెద్దల సమక్షంలోనే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గానే జరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని అంతా భావించారు. కానీ ఏం జరిగిందో కారణాలు చెప్పకపోయినా వీరిద్దరికి బ్రేకప్ అయింది. నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.

Also Read : Laya : ‘లయ’ రీ ఎంట్రీ.. ఇన్నాళ్లు అమెరికాలో ఏం చేసేదో తెలుసా..? అన్ని డబ్బులు వదిలేసుకొని సినిమా కోసం..

ఆ తర్వాత కరిష్మా కపూర్ 2003 లో సంజయ్ కపూర్ అనే వ్యాపారవేత్తని పెళ్లిచేసుకోగా 2016 లో అతనితో విడాకులు తీసుకుంది. ఇటీవలే సంజయ్ కపూర్ మరణించాడు. ప్రస్తుతం కరిష్మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అభిషేక్ తో నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యాక చాలా డిప్రెషన్ లోకి వెళిపోయానని, ఆ టైం లో నాకు నా ఫ్యామిలీ సపోర్టు చేసిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది కరిష్మా. కరిష్మా చెల్లి కరీనా కపూర్ కూడా కొన్నాళ్ల క్రితం వరకు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అని తెలిసిందే.

Also Read : Kannappa : మంచు విష్ణు ‘క‌న్న‌ప్ప‌’కు శుభ‌వార్త చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం.. 10 రోజుల పాటు..