Abhai Naveen : బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడో వారం పూర్తయి నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మూడో వారం అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన అభయ్ హీరోగా, డైరెక్టర్ గా మారి గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో వారంలో బిగ్ బాస్ నే ఎదిరించి, అందరి మీద ఫైర్ అయి బాగా వైరల్ అయ్యాడు. దీంతో నాగార్జున కూడా బిగ్ బాస్ ని ఎదురించినందుకు రెడ్ కార్డు చూపించి బయటకు పంపించేస్తాను అని అభయ్ కి వార్నింగ్ ఇచ్చాడు.
అందరూ అది వార్నింగ్ మాత్రమే అనుకున్నారు. కానీ బిగ్ బాస్ నుంచి అభయ్ ని మూడో వారం ఎలిమినేట్ చేసి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అభయ్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అభయ్.. నేను తప్పు చేయకుండా నన్ను ఎవరైనా అంటే నేను పడను, బిగ్ బాస్ కూడా కొన్ని సార్లు తప్పులు చెప్తున్నాడు, కొన్ని సార్లు చెప్పాల్సినవి చెప్పట్లేదు అంటూ బిగ్ బాస్ మీద సంచలన కామెంట్స్ చేసాడు.
Also Read : HariHara VeeraMallu Update : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి పండగే..
అయితే అభయ్ బయటకు వచ్చాక అభయ్ ఫ్యామిలీ, అతని లవ్ స్టోరీ కూడా వైరల్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో తన భార్యతో కలిసి పాల్గొన్నాడు అభయ్. అభయ్ భార్య పేరు భవాని. అభయ్ కూతురు పేరు అయంతిక. వీరికి 2019లో పెళ్లి జరిగింది. అయితే వీరి లవ్ స్టోరీ ఆసక్తికరంగా ఉంది.
అభయ్ భార్య భవాని వీళ్ళ లవ్ స్టోరీ చెప్తూ.. నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేసేటప్పుడు నాకు సంబంధాలు చూస్తుంటే ఇతని ఫొటోలు వచ్చాయి. జాబ్ చేస్తున్నాడు అని చెప్పారు. కానీ ఎందుకో ఆ ఫొటోలు పక్కన పెట్టి వేరే సంబంధాలు చూసారు మా వాళ్ళు. ఆ తర్వాత మా అన్న ఒకసారి ఈ ఫొటోలు చూసి ఇతను జాబ్ కాదు యాక్టర్ అని చెప్పడంతో మా వాళ్ళు వద్దనుకున్నారు. కానీ ఇది కొంచెం డిఫరెంట్ సంబంధం అనిపించి నేనే అభయ్ కి ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను. నాకు ఫొటోలు పంపించిన ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత మెసేజ్ చేశాను. అప్పుడు నా ఫొటోలు ఏం చేసుకున్నారు మీ ఫ్యామిలీ అని తిట్టాడు. అలా తిట్టుకోవడంతో మా పరిచయం మొదలయి మెల్లిగా ఫ్రెండ్స్ అయ్యాము. ఇన్‌స్టాగ్రామ్ లోనే మాట్లాడుకునే వాళ్ళము. అలా ఆ తర్వాత ప్రేమించుకొని ఇంట్లో చెప్తే అతను యాక్టర్ అని వద్దన్నారు. కానీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాము అని తెలిపారు.
అలాగే తను బిగ్ బాస్ లో నిజాయితీగా ఆడాను అని, తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు అంటూ తన బిగ్ బాస్ జర్నీ పై ఓ వీడియో షేర్ చేసాడు అభయ్.