HariHara VeeraMallu Update : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి పండగే.. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్‌తో షూట్ మొదలు..

నేడు ఉదయం విజయవాడలో వేసిన హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో షూట్ ప్రారంభం అయింది.

HariHara VeeraMallu Update : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి పండగే.. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్‌తో షూట్ మొదలు..

Pawan Kalyan HariHara VeeraMallu Movie Release Date Announced

Updated On : September 23, 2024 / 12:57 PM IST

HariHara VeeraMallu Update : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించారు. పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యాక తన చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్ ఇవ్వడం కష్టంగా మారింది. అయినా ఫ్యాన్స్ కోసం ఎలా అయినా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేస్తానని పవన్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా, మొదటి పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు షూట్ వాయిదా పడిన హరిహర వీరమల్లు తాజాగా మళ్ళీ షూట్ మొదలుపెట్టింది.

Also See : Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాక.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఫొటోలు..

నేడు ఉదయం విజయవాడలో వేసిన హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో షూట్ ప్రారంభం అయింది. గ్లాడియేటర్, లాస్ట్ సమురాయ్.. లాంటి భారీ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ స్టార్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో హరోయిహార వీరమల్లు భారీ యుద్ధ సన్నివేశాల షూటింగ్ నేడు ప్రారంభించారు. విజయవాడలో తోట తరణి వేసిన భారీ సెట్ లో 400 మంది ఫైటర్లతో, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ నేడు మొదలైంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూట్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 సినిమా వచ్చే సంవత్సరం 2025 మార్చ్ 28న రిలీజ్ చేస్తామని కొత్త పోస్టర్ తో ప్రకటించారు.

Image

రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో AM రత్నం నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.