Pushpa Child Artist : ‘పుష్ప’లో చిన్నప్పటి అల్లు అర్జున్ పాత్ర చేసిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తెలుసా? ఇప్పటికే బోల్డన్ని సినిమాల్లో..
పుష్ప చైల్డ్ హుడ్ క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తన నటనతో మెప్పించాడు.

Do You Know about Pushpa Child Artist Who Played Allu Arjun Child Character Dhruvan
Pushpa Child Artist : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్ర కూడా ఉంటుంది. పార్ట్ 1లో చిన్నప్పటి పుష్ప రాజ్ కి ఓ నాలుగైదు సీన్స్ ఉంటాయి. పార్ట్ 2లో కూడా ఓ రెండు సీన్స్ లో చిన్నపాటి పుష్ప పాత్ర ఉంటుంది. పుష్ప చైల్డ్ హుడ్ క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తన నటనతో మెప్పించాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ధృవన్.
ధృవన్ గతంలోనే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. పలు సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పాడు. గతంలో పుష్ప 1తో పాటు 18 పేజెస్, విమానం, ఈగల్, RRR .. మరి కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ప్రస్తుతం విశ్వంభర, రాబిన్ హుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే జైలర్ సినిమాతో పాటు పలు డబ్బింగ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లకు తెలుగు డబ్బింగ్ చెప్పాడు.
ఈ ఏజ్ లోనే ఓ పక్క నటన, మరో పక్క డబ్బింగ్ దూసుకుపోతున్న ధృవన్ ఫ్యూచర్ లో ఎంత పెద్ద ఆర్టిస్ట్ అవుతాడో చూడాలి.