Bunty Gadicherla
Bunty Gadicherla : ఋతురాగాలు, మొగలిరేకులు, చక్రవాకం.. ఇలా కొన్నేళ్ల క్రితం వచ్చిన చాలా సీరియల్స్ సూపర్ హిట్ అవ్వడమే కాక ఆ సీరియల్స్ సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి.80S కిడ్స్, 90s కిడ్స్ కి ఆ సీరియల్స్ చాలా ఫేవరేట్. అంతటి సూపర్ హిట్ సీరియల్ సాంగ్స్ కంపోజ్ చేసింది, పాడింది ఎవరో తెలుసా?(Bunty Gadicherla)
అప్పటి చాలా సీరియల్స్ కి సాంగ్స్ కంపోజ్ చేసి పాడింది గాడిచర్ల సత్యనారాయణ అలియాస్ బంటీ. MBBS చదివి డాక్టర్ అయిన ఆయన మరో పక్క మ్యూజిక్ డైరెక్టర్ కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన నేపథ్యం, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అంత సూపర్ హిట్ సాంగ్స్ ఎలా వచ్చాయి అని చెప్పుకొచ్చారు. డాక్టర్ గా సత్యనారాయణ పేరుతో కొనసాగుతూ పరిశ్రమలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ బంటిగా కొనసాగుతున్నాను అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ బంటి మాట్లాడుతూ.. నేను మొదట సింగర్, మ్యుజిషియన్ తర్వాతే డాక్టర్. మెడిసిన్ అయ్యాక చెన్నై వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ట్రై చేశాను. కానీ అక్కడ మాకు తెలిసిన ఓ వ్యక్తి చెప్పడంతో హైదరాబాద్ వచ్చి డాక్టర్ గా క్లినిక్ పెట్టాను. మా క్లినిక్ దగ్గర ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ మంజుల నాయుడుని మొదటిసారి చూసాను. ఒకరోజు మంజుల నాయుడు కొడుక్కి యాక్సిడెంట్ అవ్వడంతో ఆవిడ భర్త నా దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు నేను పరిచయం చేసుకొని మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి మంజుల నాయుడు గారి అపాయింట్మెంట్ అడిగాను. నెక్స్ట్ డే మంజుల నాయుడుని కలిసాను. నేను కంపోజ్ చేసిన కొన్ని పాటలు వినిపిస్తే బాగున్నాయి అన్నారు.
అలా మొదట సుశీల సీరియల్ కి మంజుల నాయుడు గారు ఛాన్స్ ఇవ్వడంతో సింగర్ సునీతతో టైటిల్ సాంగ్ పాడించాను. సింగర్ ఉషతో బిట్ సాంగ్ పాడించాను. దానికి మంచి పేరు రావడంతో ఋతురాగాలు సీరియల్ ఇచ్చారు. రచయిత బలభద్రపాత్రుని మధుని నేనే మంజుల నాయుడు దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన రాసిన లిరిక్స్ లో ‘వాసంత సమీరంలా.. నునువెచ్చని గ్ర్రీష్మాంలా..’ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. నేను 15 నిమిషాల్లో మ్యూజిక్ కంపోజ్ చేసి పాట రెడీ చేసేసా. అయితే ఆ సీరియల్ కి వేరే వాళ్ళ సాంగ్ కూడా ఒకటి అనుకున్నారు కానీ నాది ఫైనల్ చేశారు. ఆ పాట కూడా సింగర్ సునీత పాడింది. ఆ ఒక్క పాట పెద్ద హిట్ అవ్వడంతో నాకు గుర్తింపు వచ్చింది. ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ సింగర్స్, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ పొగిడారు.
మధ్యలో కొన్ని సినిమాలకు పనిచేసాను. కానీ నేను వెళ్లి అడగాలి ఛాన్సులు. డాక్టర్ గా కూడా చేస్తున్నాను కాబట్టి బిజీగా ఉండటంతో నాకు వచ్చినవి మాత్రమే చేశాను. చాన్నాళ్ల తర్వాత ఇటీవల శుభం సినిమాలో ‘పాలు నీళ్ల బంధం..’ అనే పాట పాడించారు నాతో. ప్రస్తుతం నేను చేసిన అభినందన, జీవన తరంగాలు, మెరుపు కలలు, ఝాన్సీ.. నాలుగు సీరియల్స్ నడుస్తున్నాయి. దాదాపు 70 సీరియల్స్ కి పాడాను, కంపోజ్ చేశాను. చక్రవాకం, మొగలిరేకులు టైటిల్ సాంగ్స్ నేనే సొంతంగా పాడాను అని తెలిపారు.
అయితే ప్రస్తుతం ఆయన.. సోమవారం నుంచి శుక్రవారం వరకు డాక్టర్ గా రెండు హాస్పిటల్స్ లో పని చేస్తూ శని, ఆది వారాలు మ్యూజిక్ చేస్తూ అప్పుడప్పుడు ఓన్ క్లినిక్ చూసుకుంటున్నారని తెలిపారు. అలాగే.. సినిమాల్లో పాడాలి, హిందీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయాలి, నేషనల్ అవార్డు సాధించాలి అనేది ఆయన కల అని తెలిపారు. తన చెల్లి అలకనంద కూడా సింగర్ అని తెలిపారు. చాన్నాళ్ల తర్వాత ఆ సూపర్ హిట్ సాంగ్స్ పాడి కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం తో ఆ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.
Also See : Digangana Suryavanshi : ఉదయం ఇలా.. రాత్రి అలా.. ఈ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?