Pradeep Ranganathan : స్టేజిపై హీరోయిన్ బుగ్గలు గిల్లి, జుట్టు పట్టి లాగి.. హీరో చేసిన పనులు.. వీడియో వైరల్..
తాజాగా డ్యూడ్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. (Pradeep Ranganathan)

Pradeep Ranganathan : సినిమా హీరో, హీరోయిన్స్ ప్రమోషన్స్ కోసం సినిమా ఈవెంట్స్ లో తెగ కష్టపడుతుంటారు. ఇటీవల ప్రేక్షకులను మెప్పించడానికి స్టేజిపై రకరకాల విన్యాసాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ చేసిన పనులు వైరల్ గా మారాయి. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా తెరకెక్కిన డ్యూడ్ సినిమా రేపు అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.(Pradeep Ranganathan)
తాజాగా డ్యూడ్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో సరదాగా హీరో, హీరోయిన్స్ ని సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయమని అడిగారు. మొదట వద్దని చెప్పినా తర్వాత మమిత బైజు కూడా చెయ్యమని అనడంతో ప్రదీప్ రంగనాథన్.. మమిత బైజు బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకొని లాగి, వెనకాల మోకాలుతో కొట్టి, చేత్తో కొట్టడం చేసాడు. ఇద్దరూ కలిసి స్టేజిపై హంగామా చేసారు.
Also See : Narne Nithin Wedding Photos : ఎన్టీఆర్ బామ్మర్ది.. నార్నె నితిన్ పెళ్లి ఫోటోలు చూశారా?
View this post on Instagram
మొత్తానికి హీరో ఇలా స్టేజిపై హీరోయిన్ బుగ్గలు గిల్లడం, జుట్టు పట్టి లాగడం, కొట్టడం లాంటివి సరదాగా చేసినా ఇది నెగిటివ్ గా మారి వైరల్ అవుతుంది. కొంతమంది క్యూట్ అని అంటుంటే కొంతమంది మాత్రం స్టేజిపై ఇలా ప్రవర్తించడం ఏంటి అని అంటున్నారు. పైగా యాంకర్ అడిగింది సినిమాలోని కేవలం బుగ్గలు గిల్లే సీన్ చూపించి రీ క్రియేట్ చేయమంది. కానీ మిగిలింది అంతా వెళ్లే చేయడం గమనార్హం.
Also Read : Mithra Mandali Review : ‘మిత్ర మండలి’ మూవీ రివ్యూ.. స్పూఫ్ కామెడీతో నవ్వుకోవాల్సిందే..