Mithra Mandali Review : ‘మిత్ర మండలి’ మూవీ రివ్యూ.. స్పూఫ్ కామెడీతో నవ్వుకోవాల్సిందే..

మిత్ర మండలి అనేది కేవలం నవ్వుకోడానికే, ఎంటర్టైన్మెంట్ మాత్రమే. (Mithra Mandali Review)

Mithra Mandali Review : ‘మిత్ర మండలి’ మూవీ రివ్యూ.. స్పూఫ్ కామెడీతో నవ్వుకోవాల్సిందే..

Mithra Mandali Review

Updated On : October 15, 2025 / 11:58 PM IST

Mithra Mandali Review : ప్రియదర్శి, నిహారిక NM జంటగా వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మిత్ర మండలి’. BV వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మాణ సంస్థలో కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజేందర్ రెడ్డి తీగల నిర్మాణంలో విజయేందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు.(Mithra Mandali Review)

కథ విషయానికొస్తే.. జంగిలిపట్నం అనే ఊరులో ఎన్నికలు వస్తాయి. అక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం తుట్టె కులం లీడర్ నారాయణ(విటివి గణేష్), ఫ్రీడమ్ రాజు(సత్య ప్రకాష్) పోటీ పడుతూ ఉంటాడు. అదే ఊళ్ళో చైతన్య(ప్రియదర్శి), సాత్విక్(విష్ణు ఓయ్), అభి(రాగ్ మయూర్), రాజీవ్(ప్రసాద్ బెహరా) నలుగురు చిల్లర ఫ్రెండ్స్ ఖాళీగా పనిపాట లేకుండా ఇంట్లో తిట్లు తిట్టించుకుంటూ తిరుగుతూ ఉంటారు. సాత్విక్, అభి.. స్వేచ్ఛ(నిహారిక NM)ని చూసి నేను లవ్ చేస్తా అంటే నేను లవ్ చేస్తా అని గొడవ పడతారు. ఈ ఇద్దరూ ఆమె వెనక తిరుగుతూ, ఆమె కోసం ఇంగ్లీష్ కోచింగ్ లో జాయిన్ అయి ఆమెని తెగ ట్రై చేస్తూ ఉంటారు. కానీ తర్వాత ఆమె తొట్టె కులం లీడర్ నారాయణ కూతురు అని తెలిసి భయపడతారు.

ఓ రోజు నారాయణ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కూతురు లేచిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే తన పరువు పోతుందని, ఎమ్మెల్యే టికెట్ రాదనీ నారాయణ SI (వెన్నెల కిషోర్) దగ్గరికి వెళ్లి తన కూతురు లేచిపోయింది కానీ కిడ్నాప్ అయినట్టు కేసు రాసుకొని వెతకమని చెప్పి బేరం ఆడతాడు. మరి అభి, సాత్విక్ స్వేచ్చకి ప్రపోజ్ చేస్తారా ? అసలు స్వేచ్ఛ ఎవర్ని లవ్ చేస్తుంది? ఇంతకీ స్వేచ్ఛది కిడ్నాపా? లేచిపోయిందా? ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుంది? మధ్యలో ఇంపార్టెంట్ క్యారెక్టర్(సత్య) ఎవరు ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also See : Mithra Mandali Pre Release Event : ‘మిత్ర మండలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..

సినిమా విశ్లేషణ..

మిత్ర మండలి అనేది కేవలం నవ్వుకోడానికే, ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఈ సినిమాలో కథ, లాజిక్స్ వెతకొద్దు అని మూవీ యూనిట్ ముందు నుంచి ప్రమోషన్స్ లో చెప్తూనే ఉంది. సినిమా అంతా ఒక సెటైరికల్ కామెడీగా, స్పూఫ్ గా తెరకెక్కించారు. కథ అయితే కులాన్ని పరువుగా భావించే ఒక అమ్మాయి మిస్ అయితే అతనేం చేసాడు? ఆమె ప్రేమ కథేంటి అని సింపుల్ లైన్. ఆ కథ అంతా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఎడిట్ ప్యాట్రన్ తో కామెడీగా చెప్పుకొచ్చారు. సమాజంలో క్యాస్ట్ పిచ్చితో ఉండే వాళ్ళ మీద, కులం చూసి ఓట్లు వేసే వాళ్ళ మీద, ప్రేమ పెళ్ళిళ్ళను వద్దనే వాళ్ళ మీద బాగా సెటైర్స్ వేశారు. ఈ సెటైర్స్ అన్ని కామెడీగా చెప్పినా ఆలోచింపచేస్తాయి.

సత్య ఒక పేరు లేని ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని మధ్య మధ్యలో తీసుకొచ్చి ఏదో చేద్దామని డిసైడ్ అయ్యారు కానీ ఆ పాత్ర చిరాకు వస్తుంది. అది లేకుండా అయినా కామెడీగా కథని నడపొచ్చు. సత్య పాత్ర వచ్చిన ప్రతిసారి అవసరమా ఈ పాత్ర అనిపిస్తుంది. అయితే సత్య పాత్రతో కూడా సినీ పరిశ్రమలో జరిగే ఓ విషయంపై సెటైర్ వేశారు. కొన్ని చోట్ల సీన్స్ సాగదీశారు. ఫస్ట్ సాంగ్ అక్కర్లేదు కానీ ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టారు. ఈ సినిమా, సాంగ్స్ అన్ని చూస్తుంటే అల్లరి నరేష్ సుడిగాడు సినిమా గుర్తుకు రాక మానదు. చాలా సినిమాల్లో సీన్స్, సాంగ్ మ్యూజిక్, సోషల్ మీడియా ట్రెండింగ్ డైలాగ్స్ తీసుకొని సెటైరియాల్, స్పూఫ్ కామెడీతో ఈ సినిమా అంతా నడిపించారు. కేవలం నవ్వుకోడానికి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి చూడొచ్చు. అయితే ఈ కామెడీ, స్క్రీన్ ప్లే అందరికి అర్ధం కాకపోవచ్చు. కొంతమంది క్రింజ్ అని కూడా ఫీల్ అవ్వొచ్చు..

Mithra Mandali Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

ప్రియదర్శి ఇప్పటికే అన్ని రకాల పాత్రలతో మనల్ని మెప్పించాడు. ఈ సినిమాలో ఖాళీగా పనిపాట లేని అబ్బాయి పాత్రలో బాగా నటించాడు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో రీల్స్ తో మెప్పించిన నిహారిక హీరోయిన్ గా పర్వాలేదనిపించింది. విష్ణు ఓయ్, రాగ్ మయూర్ ఫ్రెండ్స్ పాత్రల్లో అదరగొట్టారు. ప్రసాద్ బెహరా కూడా బాగానే నటించాడు. వెన్నెల కిషోర్ ఫ్రస్టేషన్ ఉన్న పాత్రలో బాగా నటించారు. సత్య, విటివి గణేష్, సత్య ప్రకాష్, రఘు, జీవన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. బ్రహ్మానందం ఓ సాంగ్ లో మెరిశారు.

Also Read : Mithra Mandali : ‘మిత్ర మండలి’ థియేట్రికల్ బిజినెస్ ఇంతేనా? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగా ప్లస్ అయ్యాయి. మ్యూజిక్ లో కూడా స్పూఫ్ చేసారు. చాలా పాత సూపర్ హిట్ సినిమాల్లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని, పాటల్లోని మ్యూజిక్ ని తీసుకొచ్చి రీమిక్స్ చేసి కొత్తగా వినిపించారు. పాటలు కూడా కామెడీగా అనిపిస్తాయి. ఎడిటింగ్ బాగా చేసినా కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. సింపుల్ స్టోరీ తీసుకొని ఇలాంటి సెటైరికల్ కామెడీగా రాసుకోవడం చాలా కష్టం. డైరెక్టర్ చాలా బాగా రాసుకొని మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘మిత్ర మండలి’ సినిమా సమాజంలోని క్యాస్ట్ అనే ఇష్యూ మీద సెటైరికల్ గా కామెడీ చేస్తూ తెరకెక్కించిన సినిమా. లాజిక్స్, కథ లాంటివి వెతక్కుండా నవ్వుకోడానికి చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.