Mithra Mandali : ‘మిత్ర మండలి’ థియేట్రికల్ బిజినెస్ ఇంతేనా? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..
మిత్ర మండలి సినిమా రేపు అక్టోబర్ 16న రిలీజ్ అవుతుండగా నేడు రాత్రికే ప్రీమియర్స్ వేసేస్తున్నారు. (Mithra Mandali)

Mithra Mandali
Mithra Mandali : ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక NM కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘మిత్ర మండలి’. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై విజయేందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలిసిపోతుంది.(Mithra Mandali)
మిత్ర మండలి సినిమా రేపు అక్టోబర్ 16న రిలీజ్ అవుతుండగా నేడు రాత్రికే ప్రీమియర్స్ వేసేస్తున్నారు. ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారట. మిత్ర మండలి సినిమా కేవలం 5 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించారని టాక్ నడుస్తుంది. దీంతో ఆల్రెడీ నాన్ థియేటరికల్ ఓటీటీ బిజినెస్ కూడా అయిపోయిందని చెప్పారు నిర్మాతలు.
Also Read : Raviteja : రవితేజ ఫ్యాన్స్ కి నిరాశే.. మాస్ జాతర సినిమా టైంకి..
అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా సింపుల్ గా జరిగిందట. మిత్ర మండలి సినిమా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ అన్ని కలుపుకొని 5 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని సమాచారం. ఈ లెక్కన మిత్ర మండలి సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 6 కోట్ల షేర్, అంటే ఆల్మోస్ట్ 12 కోట్ల గ్రాస్ రావాలి. కామెడీ సినిమా కావడం, ముందే ప్రీమియర్స్ వేయడం, దీపావళి సీజన్ కావడంతో ఈజీగానే కలెక్ట్ చేసి హిట్ అవుతుందని భావిస్తున్నారు.