Raviteja : రవితేజ ఫ్యాన్స్ కి నిరాశే.. మాస్ జాతర సినిమా టైంకి..

ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ తో మాస్ జాతర కమర్షియల్ సినిమా అని తెలిసిపోతుంది. (Raviteja)

Raviteja : రవితేజ ఫ్యాన్స్ కి నిరాశే.. మాస్ జాతర సినిమా టైంకి..

Raviteja

Updated On : October 15, 2025 / 8:09 AM IST

Raviteja : మాస్ మహారాజ రవితేజ గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నారు. క్రాక్ సినిమా తర్వాత రవితేజ మళ్ళీ హిట్ కొట్టలేదు. ఫ్యాన్స్ మాస్ మహారాజా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు రవితేజ మాస్ జాతర సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 31న రాబోతుంది. ఈ సినిమాపై కాస్తో కూస్తో అంచనాలు ఉన్నాయి.(Raviteja)

ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ తో మాస్ జాతర కమర్షియల్ సినిమా అని తెలిసిపోతుంది. ఇందులో రవితేజ రైల్వే పోలీస్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కి రవితేజ ఉండట్లేదట. అసలే రవితేజ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఇలాంటి టైంలో జనాల్లోకి రాకుండా, ప్రమోషన్స్ కి రాకుండా ఉంటే ఇప్పుడున్న కాంపిటేషన్ లో ఎలా అంటున్నారు. అసలే అక్టోబర్ 31 బాహుబలి రీ రిలీజ్ ఉంది పోటీకి.

Also Read : Prabhas : మొన్న కన్నప్ప.. ఇవాళ రాజాసాబ్.. పాపం అందుకే సినిమా వాయిదా.. డైరెక్టర్ నే బెదిరించాడట..

రవితేజ ఇటీవల మాస్ జాతర ప్రమోషన్స్ కోసం ఒక అయిదారు ఇంటర్వ్యూలు ఒకే రోజు షూట్ చేసేసి వెళ్లిపోయారట. రవితేజ నెక్స్ట్ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం 25 రోజులు స్పెయిన్ వెళ్ళాడట. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. రవితేజ వచ్చేవరకు షూట్ చేసిన ఇంటర్వ్యూలనే మెల్లిమెల్లిగా ఒక్కోటి వదులుతారట.

మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా వస్తాడా, 25 రోజులు అంటే పెద్ద షెడ్యూల్ కదా, సినిమా రిలీజ్ కి ఇక్కడ ఉంటాడా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన టైంలో ప్రమోషన్స్ కి లేకుండా వెళ్లిపోవడం మాత్రం ఫ్యాన్స్ కి ఒకింత నిరాశే. ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చేది ఫ్యామిలీ లవ్ స్టోరీ అని సమాచారం.

Also Read : Baasha : 21 లక్షలు పెట్టి తెలుగు రైట్స్ కొంటే.. బాషా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?