Prabhas : మొన్న కన్నప్ప.. ఇవాళ రాజాసాబ్.. పాపం అందుకే సినిమా వాయిదా.. డైరెక్టర్ నే బెదిరించాడట..
VFX కోసం ముంబై, లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. (Prabhas)

Prabhas
Prabhas : ఇటీవల ప్రతి సినిమాకు VFX లేనిదే పని జరగట్లేదు. ఇక పెద్ద పెద్ద సినిమాలు, భారీ కథలు, విజువల్స్ ఉన్నవాటికి VFX ముఖ్యం. దీంతో VFX నిపుణులు సినిమా వాళ్ళ మీద అధికారం చెలాయిస్తున్నారు అని టాక్ నడుస్తుంది. VFX కోసం ముంబై, లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. హైదరాబాద్ లో ఇప్పుడిప్పుడే VFX నిపుణులు పెరుగుతున్నారు.(Prabhas)
సినిమాల్లో VFX అవసరాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని క్యాష్ చేసుకోవడమే కాక సినిమాని పూర్తి చెయ్యట్లేదు కూడా. కొన్నాళ్ల క్రితం మంచు విష్ణు కన్నప్ప సినిమాకు ఒక VFX సూపర్ వైజర్ డబ్బులు తీసుకొని పని చేయలేదు, కొన్ని లక్షలు నష్టం వచ్చింది, అందుకే సినిమా ఆలస్యం అయింది. తర్వాత అతన్ని తీసేసి ఇంకొకరిని పెట్టుకున్నాము అని విష్ణు చెప్పాడు. ఆ సినిమాలో ప్రభాస్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Also Read : Baasha : 21 లక్షలు పెట్టి తెలుగు రైట్స్ కొంటే.. బాషా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
అయితే ఇప్పుడు అదే పరిస్థితి ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు కూడా వచ్చింది. రాజాసాబ్ సినిమా గత సంవత్సరమే రావాల్సింది. అప్పట్నుంచి వాయిదా వేస్తూనే ఉన్నారు. తాజాగా రాజాసాబ్ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్ ఏప్రిల్ 2025 లోనే రిలీజ్ అని పక్కాగా ప్లాన్ చేసుకున్నాం. కానీ VFX వర్క్ అవ్వలేదు. VFX సూపర్ వైజర్ గా చేసిన వ్యక్తి పని పూర్తి చేయడమే కాక డబ్బులు తీసుకొని పని గురించి అడిగితే తప్పించుకొని తిరిగాడు. మేము గట్టిగా అడిగితే అసలు వర్క్ చేయను అని డైరెక్టర్ మారుతి దగ్గర బెదిరించాడట. అతని వల్లే సినిమా ఆలస్యం అయింది. ఆ తర్వాత అతన్ని తీసేసి ఇంకొకరికి ఆ VFX పని ఇచ్చాము. దాని వాళ్ళ మాకు కొన్ని లక్షలు నష్టం కూడా వచ్చింది అని తెలిపారు.
ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ మా హీరో సినిమాలకే ఇలాంటివి జరగాలా అప్పుడు కన్నప్ప, ఇప్పుడు రాజాసాబ్ అని ఫీల్ అవుతున్నారు. ఇక రాజాసాబ్ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.