Baasha : 21 లక్షలు పెట్టి తెలుగు రైట్స్ కొంటే.. బాషా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
. తమిళ్ తో పాటే తెలుగులో కూడా రిలీజయి ఇక్కడ కూడా పెద్ద హిట్ అయింది.(Baasha)

Baasha
Baasha : రజినీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో బాషా ఒకటి. 1995 లో ఈ సినిమా రిలీజయి పెద్ద హిట్ అయింది. తమిళ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజినీకాంత్, నగ్మా జంటగా రఘువరన్ విలన్ గా డాన్, గ్యాంగ్ స్టర్ తరహా కథతో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. తమిళ్ తో పాటే తెలుగులో కూడా రిలీజయి ఇక్కడ కూడా పెద్ద హిట్ అయింది.(Baasha)
అయితే అప్పట్లో డబ్బింగ్ సినిమాలు చాలా తక్కువ రేటుకే కొనేవాళ్ళు. కానీ బాషా సినిమాకు అప్పటికి పెట్టే రేటు కంటే ఎక్కువే పెట్టారు. బాషా సినిమా తెలుగు రైట్స్ ని దాదాపు 21 లక్షలకు కొన్నారట. అప్పట్లో అది పెద్ద అమౌంట్. రజినీకాంత్ స్టార్ డమ్, సినిమా బాగుండటంతో అంత రేటు పెట్టి కొన్నారు.
Also Read : K Ramp Movie : హీరో పవన్ ఫ్యాన్.. డైరెక్టర్ మహేష్ ఫ్యాన్.. నిర్మాత బాలయ్య ఫ్యాన్.. భలే కాంబో సెట్ అయిందిగా..
అయితే బాషా సినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చి పెద్ద హిట్ అయింది. ఇక్కడ కూడా రజినీకాంత్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. బాషా సినిమా ఏకంగా తెలుగులో 3 కోట్లు వసూలు చేసింది . 1995 లో మూడు కోట్ల కలెక్షన్స్ అంటే, అది కూడా తమిళ్ డబ్బింగ్ సినిమాకు వచ్చాయంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.