K Ramp Movie : హీరో పవన్ ఫ్యాన్.. డైరెక్టర్ మహేష్ ఫ్యాన్.. నిర్మాత బాలయ్య ఫ్యాన్.. భలే కాంబో సెట్ అయిందిగా..

తాజాగా K ర్యాంప్ సినిమా యూనిట్ తమ ఫేవరేట్ హీరోల గురించి చెప్పడంతో ఆసక్తికరంగా మారింది.(K Ramp Movie)

K Ramp Movie : హీరో పవన్ ఫ్యాన్.. డైరెక్టర్ మహేష్ ఫ్యాన్.. నిర్మాత బాలయ్య ఫ్యాన్.. భలే కాంబో సెట్ అయిందిగా..

K Ramp Movie

Updated On : October 14, 2025 / 9:59 PM IST

K Ramp Movie : ఇప్పటి స్టార్ హీరోలకు ఇప్పుడు సినీ పరిశ్రమకు వచ్చేవాళ్లంతా అభిమానులే. వాళ్ళని చూసి ప్రేరణ పొంది సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా K ర్యాంప్ సినిమా యూనిట్ తమ ఫేవరేట్ హీరోల గురించి చెప్పడంతో ఆసక్తికరంగా మారింది.(K Ramp Movie)

K ర్యాంప్ టీజర్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా డైరెక్టర్ జైన్స్ నాని మహేష్ బాబు ఫ్యాన్. ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు. మేము కూడా సరదాగా కొట్టుకుంటాము కానీ కలిసి గట్టిగా వర్క్ చేసాము అని అన్నారు. ఇటీవల K ర్యాంప్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమా నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. నేను బాలయ్య ఫ్యాన్ అంటూ తొడ కొట్టి మరీ సినిమా సక్సెస్ సాధిస్తుందని చెప్పాడు.

Also Read : Rani Mukerji : 14 నెలల నా కూతురికి పాలు ఇస్తూ షూటింగ్ కి వెళ్లేదాన్ని.. దీపికాకు కౌంటర్ ఇచ్చిందా? సపోర్ట్ చేసిందా?

నేడు నిర్మాత రాజేష్ దండా మీడియాతో మాట్లాడుతూ.. మా హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా డైరెక్టర్ మహేష్ బాబు ఫ్యాన్. నేను బాలయ్య ఫ్యాన్. వాళ్ళ స్టైల్ లో వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి నేను బాలయ్య స్టైల్ లో తొడ కొట్టి చెప్పాను మా సినిమా గురించి. నాకు బాలయ్య గారితో ఎప్పటికైనా సినిమా తీయాలని కోరిక. నా మొదటి సినిమా నుంచి అనుకుంటున్నాను. అది లేట్ అయినా జరుగుతుంది. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నారు.

ఇలా హీరో, దర్శక నిర్మాతలు ముగ్గురూ.. ముగ్గురు హీరోల అభిమానులు కావడం, ముగ్గరు కలిసి ఒకర్నొకరు గౌరవించుకుంటూ సినిమా చేయడం విశేషం. ఫ్యాన్ వార్స్ అని గొడవలు చేసేవాళ్లంతా వీళ్ళని చూసి నేర్చుకోవాలని అంటున్నారు. ఇండస్ట్రీలో మేము మేము బాగానే ఉంటాము అని ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్, చరణ్, పవన్ కళ్యాణ్.. వీళ్లంతా ఫ్యాన్ వార్స్ వద్దని మాట్లాడారు.

Also Read : Prabhas Anushka : ప్రభాస్ పాట విని ఏడ్చేసిన అనుష్క.. ఏ సినిమా.. ఏం సాంగ్ తెలుసా?

ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు తమ అభిమాన హీరోల గురించి చెప్తూనే అందరం కలిసి ఉండాలి అనే మెసేజ్ ఇస్తున్నారు. ఇది చూసి భలే కాంబో సెట్ అయిందిగా సినిమాకు ముగ్గురు హీరోల ఫ్యాన్స్ వస్తే సినిమా కూడా ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసైనా ఫ్యాన్ వార్స్ చేసే బ్యాచ్ మారతారేమో చూడాలి మరి. ఇక కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ కానుంది.