Prabhas Anushka : ప్రభాస్ పాట విని ఏడ్చేసిన అనుష్క.. ఏ సినిమా.. ఏం సాంగ్ తెలుసా?
ఒక ప్రభాస్ సాంగ్ విన్నప్పుడు అనుష్క ఏడ్చిందట. ఈ విషయం మీకు తెలుసా?(Prabhas Anushka)

Prabhas Anushka
Prabhas Anushka : ప్రభాస్ – అనుష్క ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ పెయిర్ అని తెలిసిందే. బిల్లా, మిర్చి, బాహుబలి రెండు పార్టులు.. మొత్తం నాలుగు సినిమాల్లో ఈ జంట కలిసి నటించింది. బయట కూడా వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుండు అనేంతగా వీరి కెమిస్ట్రీ పండింది. కానీ అది జరగలేదు. ఇప్పుడు ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక ప్రభాస్ సాంగ్ విన్నప్పుడు అనుష్క ఏడ్చిందట. ఈ విషయం మీకు తెలుసా?(Prabhas Anushka)
ప్రభాస్ – అనుష్క కలిసి నటించిన మిర్చి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కి తండ్రితో ఎమోషన్ ఉన్న సీన్స్ కూడా ఉంటాయి. తండ్రి – కొడుకుల మధ్య ఎమోషన్ తో.. ‘పండగలా దిగివచ్చావు.. ప్రాణాలకు వెలుగిచ్చావు..’ అనే సాంగ్ ఉంటుంది. ఈ పాట విని అనుష్క ఏడ్చిందట.
Also Read : Prasad Behara : పాపం అక్కా అని పనిమనిషిని బాగా చూసుకుంటే.. కమెడియన్ ని ఎంత మోసం చేసిందంటే.. ఏకంగా..
గతంలో ప్రభాస్, అనుష్క కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. ఆ పాట రాగానే నేను, నా ఫ్రెండ్స్ రోజంతా ఆల్మోస్ట్ 70 సార్లు నాన్ స్టాప్ గా విన్నాము. దేవికి ఫోన్ చేసి డార్లింగ్ కెరీర్ బెస్ట్ సాంగ్ ఇచ్చావు అని అన్నాను. పొద్దున్నే షూటింగ్ లో స్వీటికి ఈ సాంగ్ వినిపించా అంతే ఏడ్చేసింది అని అన్నాడు.
అనుష్క మాట్లాడుతూ.. రఫ్ కాపీ విన్నప్పుడే నేను ఏడ్చేసాను. నాకు ఆ లిరిక్స్ ఇష్టం. అయ్యంటే ఆనందం.. అయ్యంటే సంతోషం.. ఆ లిరిక్స్ బాగున్నాయి. పాట మొత్తంలో ‘ఓ జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడూ ఈ ఊరి ఉయ్యాల..’ అనే లిరిక్స్ కూడా హార్ట్ టచింగ్ అయ్యాయి. అందుకే ఎమోషనల్ అయ్యాను అని చెప్పుకొచ్చింది.
Also Read : Siddhu Jonnalagadda : హీరోయిన్స్ డేట్స్ కోసం హీరోలే ఎదురు చూస్తారు.. సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు..
అనుష్క పాట విని ఏడ్చింది ఈ సాంగ్ కే..