Prasad Behara : పాపం అక్కా అని పనిమనిషిని బాగా చూసుకుంటే.. కమెడియన్ ని ఎంత మోసం చేసిందంటే.. ఏకంగా..

ప్రసాద్ బెహరా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పనిమనిషి చేసిన మోసం గురించి చెప్పాడు.(Prasad Behara)

Prasad Behara : పాపం అక్కా అని పనిమనిషిని బాగా చూసుకుంటే.. కమెడియన్ ని ఎంత మోసం చేసిందంటే.. ఏకంగా..

Prasad Behara

Updated On : October 14, 2025 / 6:34 PM IST

Prasad Behara : యూట్యూబ్ సిరీస్ లతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రసాద్ బెహరా కీలక పాత్రలో నటించిన మిత్ర మండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రసాద్ బెహరా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పనిమనిషి చేసిన మోసం గురించి చెప్పాడు.(Prasad Behara)

ప్రసాద్ బెహరా మాట్లాడుతూ.. మా పనిమనిషి ఒకామె ఉండేది. నా డైవర్స్ అయ్యాక ఆమెని ఇంటి పనిచేయాలి ఎంత కావాలి అని అడిగితే 3000 వేలు సాలరీ అడిగింది. నేను 6000 ఇస్తాను నాకు నువ్వు చూసే సీరియల్ స్టోరీలు, మీ వీధిలో జరిగే కథలు చెప్పమన్నాను. ఆమె ఓకే అని చెప్పి రోజూ కథలు చెప్పేది. నేను అక్కా అని పిలిచి ఆమెకు సపోర్ట్ చేశాను బాగా.

Also Read : Siddhu Jonnalagadda : హీరోయిన్స్ డేట్స్ కోసం హీరోలే ఎదురు చూస్తారు.. సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రతి వారం వాళ్ళ ఫ్యామిలీని సినిమాకి పంపించేవాడ్ని. మటన్, నెలకు బియ్యం, సరుకులు అన్ని ఇచ్చాను. ఇవి కాకుండా 6000 ఇచ్చాను. ఆమెని అక్కా అని అంత బాగా చూసుకునేవాడ్ని. కొన్నాళ్ళకు నా వాచ్ లు మిస్ అయ్యాయి. నాలుగు వాచ్ లు మిస్ అయ్యాయి. ఎలా పోతున్నాయో అర్ధం కాలేదు. ఓ రోజు నా యాపిల్ వాచ్ ఆమె కొంగున కట్టుకొని తీసుకెళ్తుంటే సౌండ్ వచ్చింది. దాంతో ఆమెని పిలిచి ఏంటి ఇది అని ప్రశ్నించాను. 90 వేలు అక్క అది, పోయిన వాచ్ లు కూడా కలుపుకుంటే లక్షన్నర వాటి విలువ అని చెప్తే ఆమె.. అవునా షాప్ వాడు 400 మాత్రమే ఇచ్చాడు అని బాధపడింది. ఇలా వాచ్ లు కొట్టేసినందుకు ఆమెకు బాధ లేదు ఆ షాప్ వాడు తక్కువ ఇచ్చాడు అని బాధపడింది అని చెప్పుకొచ్చాడు.