Rani Mukerji : 14 నెలల నా కూతురికి పాలు ఇస్తూ షూటింగ్ కి వెళ్లేదాన్ని.. దీపికాకు కౌంటర్ ఇచ్చిందా? సపోర్ట్ చేసిందా?

తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ దీనిపై స్పందించారు. (Rani Mukerji)

Rani Mukerji : 14 నెలల నా కూతురికి పాలు ఇస్తూ షూటింగ్ కి వెళ్లేదాన్ని.. దీపికాకు కౌంటర్ ఇచ్చిందా? సపోర్ట్ చేసిందా?

Rani Mukerji

Updated On : October 14, 2025 / 9:05 PM IST

Rani Mukerji : ఇటీవల బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ స్పిరిట్ సినిమా నుంచి తక్కువ పనిగంటలు పనిచేస్తాను అంటూ దాంతో పాటు చాలా కండిషన్స్ పెట్టడంతో ఆమెని తప్పించారు. ఆ తర్వాత కల్కి 2 నుంచి తప్పించారు. దీంతో దీపికా విషయం బాలీవుడ్ లో చర్చగా మారింది. ఈ క్రమంలో రోజుకు 8 గంటలే పనిచేస్తాము అనేదానిపై చర్చగా మారింది.(Rani Mukerji)

ఈ విషయంలో ఒకరిద్దరు తప్ప అందరూ దీపికాని తప్పు పడుతున్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది రెగ్యులర్ జాబ్ కాదు. అక్కడ కథ, టైమింగ్, వేరే స్టార్స్ డేట్స్ బట్టి షూటింగ్ జరుగుతుంది. చాలా మంది స్టార్స్ రాత్రి పగలు లేకుండా కష్టపడతారు. దీపికా చాలా కండిషన్స్ పెట్టినా 8 గంటలే పనిచేస్తాను అనేదానిపై మాత్రం చాలా మంది ఇండైరెక్ట్ గా స్పందిస్తున్నారు. కొంతమంది దీపికా ఇటీవలే తల్లి అయింది కాబట్టి తన కూతురికి సమయం ఇవ్వడానికి అలా చెప్తుంది అని ఆమెని వెనకేసుకొస్తున్నారు.

Also Read : They Call Him OG : అదేంటి.. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఓజీ’.. ఓటీటీలోకి అప్పుడే వచ్చేస్తుందా? స్ట్రీమింగ్ ఎక్కడ?

తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ దీనిపై స్పందించారు. రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. నేను హిచ్‌కీ సినిమా చేస్తున్నప్పుడు నా కూతురుకు 14 నెలల వయసు. అప్పుడు తనకు పాలు పడుతున్నా ఇంకా. నేను పొద్దున్నే పాలు పట్టి షూటింగ్‌కి వెళితే మధ్యాహ్నం వరకు నా పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లి మళ్ళీ నా పాపకు పాలు ఇచ్చేదాన్ని. ఆ సినిమా అంతా అలాగే చేశాను.

నా షూటింగ్ పార్ట్ కొంత ముందే పూర్తిచేసి పంపించేలా దర్శకుడితో మాట్లాడుకున్నా. దాని బట్టి దర్శకుడు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. దీని గురించి మా దర్శకుడు, మూవీ యూనిట్ అంతా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. సినిమా నిర్మాతకు, దర్శకుడికి ఓకే అయితేనే ఆ సినిమా చేయాలి. దాని గురించి మనం అన్ని ముందే డిస్కస్ చేయాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే సినిమా మానేయాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. మనల్ని చేయమని ఎవరూ ఫోర్స్ చేయరు అని చెప్పుకొచ్చింది.

Also Read : Prabhas Anushka : ప్రభాస్ పాట విని ఏడ్చేసిన అనుష్క.. ఏ సినిమా.. ఏం సాంగ్ తెలుసా?

దీంతో రాణి ముఖర్జీ తనకు తల్లిగా ఉన్నా కష్టపడుతూ షూటింగ్ చేశాను అని, ఆ షూటింగ్ చేయాలా వద్దా అనేది మన నిర్ణయం అని చెప్పింది కాబట్టి ఈమె దీపికాకు సపోర్ట్ చేసిందని పలువురు అంటే మరికొంతమంది మాత్రం అలాంటి పరిస్థితుల్లో కూడా దర్శక నిర్మాతలను ఒప్పించుకొని సినిమా చేసింది, దర్శక నిర్మాతలను నెగిటివ్ చేయలేదు, అంతా మన చేతుల్లోనే ఉంది అని అంటుంది కాబట్టి దీపికాకు కౌంటర్ ఇస్తుంది అని అంటున్నారు.