They Call Him OG : అదేంటి.. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఓజీ’.. ఓటీటీలోకి అప్పుడే వచ్చేస్తుందా? స్ట్రీమింగ్ ఎక్కడ?

ఇటీవల సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఓటీటీ సంస్థలతో ఉన్న ఒప్పందంతో నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. (They Call Him OG)

They Call Him OG : అదేంటి.. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఓజీ’.. ఓటీటీలోకి అప్పుడే వచ్చేస్తుందా? స్ట్రీమింగ్ ఎక్కడ?

They Call Him OG

Updated On : October 14, 2025 / 7:47 PM IST

They Call Him OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల OG సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. ఆల్మోస్ట్ 310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. OG సినిమాకు వచ్చిన హైప్, ఈ సినిమాలో పవన్ యాక్షన్ సీక్వెన్స్, సినిమాలో పవన్ స్టైలిష్ లుక్స్, సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం, పవన్ కూడా OG సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.(They Call Him OG)

ఇటీవల సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఓటీటీ సంస్థలతో ఉన్న ఒప్పందంతో నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే ఇంత పెద్ద హిట్ సినిమా కూడా ఇప్పుడు నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తుందట.

Also Read : Prabhas Anushka : ప్రభాస్ పాట విని ఏడ్చేసిన అనుష్క.. ఏ సినిమా.. ఏం సాంగ్ తెలుసా?

తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం OG సినిమా అక్టోబర్ 23 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీంతో అంత తొందరగా ఓటీటీలోకి వచ్చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. మూవీ యూనిట్ కానీ నెట్ ఫ్లిక్స్ కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ లెక్కన దీపావళి తర్వాత OG సినిమా ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తుంది. మరి థియేటర్స్ లో ఫుల్ సౌండ్ చేసిన OG సినిమా ఓటీటీలో ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.