Do You Know about Sunitha Manohar Dupe for Ramyakrishnan in Bahubali fame with Mad Movie
Sunitha Manohar : సినిమాల్లో నటీనటులకు డూప్ లను వాడతారని తెలిసిందే. అయితే యాక్షన్ సీక్వెన్స్ లకే కాదు రియల్ నటీనటులు అందుబాటులో లేనప్పుడు వాళ్ళ షోల్డర్ సీన్స్, చీటింగ్ సీన్స్ కూడా అప్పుడప్పుడు డూప్స్ ని వాడతారు. తాజాగా ఓ నటి బాహుబలి సినిమాలో రమ్యకృష్ణకు డూప్ గా చేశాను అని చెప్పుకొచ్చింది. ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చినా మహేష్ బాబు సినిమాలో రియల్ స్టంట్స్ చేసినా ఇటీవల జాతిరత్నాలు, మ్యాడ్ సినిమాలతోనే ఎక్కువ ఫేమ్ వచ్చింది ఈ నటికి.
ఈ నటి పేరు సునీత మనోహర్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. సినిమాలు, యాంకరింగ్ ల మీద ఇష్టంతో పెళ్లి తర్వాత ట్రైల్స్ వేసింది. అప్పట్లో అన్ని అవకాశాలు రాకపోయినా తర్వాత నటిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మహేష్ బాబు స్పైడర్ సినిమాలో లేడీస్ తో విలన్ ని పట్టుకునే సీన్ ఉంటుంది కదా. ఆ సీన్ లో గోడ మీద నుంచి దూకడాలు, ఒక ఇంటి మీద నుంచి ఇంకో ఇంటికి వెళ్ళడాలు లాంటివి సునీత ఎలాంటి రోప్స్ లేకుండా రియల్ గానే చేసిందని ఇంటర్వ్యూలోనే తెలిపింది. అది చూసి డైరెక్టర్ మురుగదాస్ ఇంటి దగ్గర చెప్పొచ్చారా, భయం లేదా అని అడిగారట.
Also Read : Sridevi : మా అమ్మ సింగిల్ పేరెంట్.. స్టేజిపై ఏడ్చేసిన ‘కోర్ట్’ హీరోయిన్.. అమ్మని హత్తుకొని.. వీడియో వైరల్..
అలాగే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణకు డూప్ గా చేశారట. రమ్యకృష్ణ లేనప్పుడు వేరేవాళ్ళ మీద చేసే సీన్స్ ఉండి లొకేషన్ లో రమ్యకృష్ణ కూడా ఉండాలన్నప్పుడు సునీత మనోహర్ ని పెట్టారట. బాహుబలిలో రమ్యకృష్ణ చీటింగ్ షాట్స్, షోల్డర్ షాట్స్ సునీతతోనే తీసారట. షూటింగ్ లో ప్రభాస్ ఎదురుగా నిలబడే కొన్ని సీన్స్ లో కూడా నటించానని, రోజూ ప్రభాస్ కి గుడ్ మార్నింగ్ సర్ అని చెప్పేదాన్ని అంటూ తెలిపింది.
జాతిరత్నాలు సినిమాతో కొంత ఫేమ్ తెచ్చుకున్న సునీత మనోహర్ మ్యాడ్ సినిమాలో విష్ణుకి తల్లి పాత్రలో బాగా వైరల్ అయింది. ఐ లవ్ యు మమ్మీ అని చెప్తే ఏం లత్కోర్ పని చేసినవి రా అని చెప్పిన డైలాగ్ తో స్టార్ డమ్ తెచ్చుకుంది సునీత. అప్పట్నుంచి వరుసగా సినిమా, సీరియల్స్, వెబ్ సిరీస్ లలో ఆఫర్స్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, సీరియల్స్ తో బిజీగానే ఉంది సునీత మనోహర్.
Also Read : Manchu Manoj : రాజకీయాల్లోకి రావడంపై మనోజ్ క్లారిటీ.. దాన్ని మీరేమంటారో మీ ఇష్టం అంటూ..