Anchor Ravi : యాంకర్ రవి అనేక టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకోవడమే కాక తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 12 వారాలు ఉన్నాడు రవి. ప్రస్తుతం పలు టీవీ షోలతో యూట్యూబ్ వీడియోలతో, బయట ఈవెంట్స్ తో బిజీగానే ఉన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి బిగ్ బాస్ గురించి కూడా పలు విషయాలు తెలిపాడు.
ఈ క్రమంలో రవికి బిగ్ బాస్ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి నిజమేనా అని అడగ్గా రవి సమాధానమిస్తూ.. నా జర్నీ మా టీవీలోనే మొదలైంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్. నన్ను మొదటి సీజన్ నుంచి బిగ్ బాస్ లో అడుగుతూనే ఉన్నారు. నేను నో ఎలా చెప్పాలో తెలియక ఒకసారి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాను వాళ్ళు నో చెప్తారని. అయినా వాళ్ళు ఒప్పుకున్నారు. దాంతో అక్కడ లాక్ అయిపోయి వెళ్లాను. నేను చెప్పిన అమౌంట్ కి వాళ్ళు ఓకే చెప్పడంతో నేను కూడా ఆ రెమ్యునరేషన్ కు ఫ్లాట్ అయ్యాను. ఆ డబ్బుతో ఇల్లు కొన్నాను. నాకు ఇచ్చినంత బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఎవ్వరికీ ఇవ్వలేదు. దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువే వచ్చాయి అని తెలిపారు.
Also Read : Couple Friendly : ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీజర్ రిలీజ్.. లిప్ కిస్ తో మానస వారణాసి, సంతోష్ శోభన్..
దీంతో రవి బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువే ఇచ్చారా? విన్నర్ ప్రైజ్ మనీ కంటే కూడా ఎక్కువ అని అంతా ఆశ్చర్యపోతున్నారు.