Couple Friendly : ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీజర్ రిలీజ్.. లిప్ కిస్ తో మానస వారణాసి, సంతోష్ శోభన్..
మీరు కూడా కపుల్ ఫ్రెండ్లీ టీజర్ చూసేయండి..

Couple Friendly
Couple Friendly : సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా కపుల్ ఫ్రెండ్లీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.
తాజాగా కపుల్ ఫ్రెండ్లీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే.. శివ(సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సరైన ఉద్యోగం లేక చెన్నైలో బైక్ పూలింగ్ చేస్తూ ఉంటాడు. ప్రీతి (మానస వారణాసి) శివ బైక్ పై జర్నీ చేస్తుంది. అపరిచితులుగా కలిసిన శివ, ప్రీతి ప్రేమికులుగా మారడం, సన్నిహితంగా ఉన్న వారి ప్రేమ సన్నివేశాలను చూపిస్తూ టీజర్ ఆసక్తిగా సాగింది. టీజర్ లోనే లిప్ కిస్, రొమాన్స్ చూపించడంతో సినిమాలో ఇంకే రేంజ్ లో రొమాన్స్ ఉంటుందో అని భావిస్తున్నారు.
మీరు కూడా కపుల్ ఫ్రెండ్లీ టీజర్ చూసేయండి..