War 2 : ఎన్టీఆర్ – హృతిక్ ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ..? హృతిక్ వస్తాడా?
తాజాగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చేసింది.

war 2 pre release event
War 2 : యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వార్ 2’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. వార్ 2 సినిమా ఆగస్టు 14 న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
తాజాగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చేసింది. తెలుగులో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఆదివారం ఆగస్టు 10న సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఓపెన్ గ్రౌండ్స్ లో భారీగా అభిమానుల మధ్య చేస్తామని ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేవరకు ఎలాంటి బహింరంగ ఈవెంట్ జరగకపోవడంతో ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చి మాట్లాడతాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఈవెంట్ కి హృతిక్ రోషన్ కూడా వస్తాడా, కియారా అద్వానీ వస్తుందా లేదా చూడాలి.
Also Read : Anchor Ravi : పెద్ద డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఒక చిన్న వేషం అయినా ఇమ్మని అడిగా.. ఆయన ఏమన్నాడంటే..