BiggBoss Telugu Season 8 Winner Nikhil Maliyakkal Background
Nikhil Maliyakkal : గత కొన్ని వారాలుగా సాగుతున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో పూర్తయింది. ఈ సీజన్ విన్నర్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ నిలిచాడు. కర్ణాటకకు చెందిన ఈ నటుడు తెలుగులో గోరింటాకు సీరియల్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సీరియల్స్, టీవీ షోలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సీరియల్స్ కు రాకముందు ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
నిఖిల్ కర్ణాటకలోని మైసూర్ కు చెందిన వ్యక్తి. నిఖిల్ తల్లి కూడా ఒక నటి. అతని తండ్రి జర్నలిస్ట్. దీంతో అతనికి కూడా చిన్నప్పట్నుంచి సినిమాలు, మీడియా రంగంపై ఆసక్తి నెలకొంది. అయితే నిఖిల్ మంచి డ్యాన్సర్ కావడంతో చిన్నప్పట్నుంచి డ్యాన్స్ నేర్చుకొని పలు ప్రదర్శనలు ఇచ్చాడు. చదువు అయ్యాక ఓ ప్రైవేట్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ కూడా చేసాడు. అయితే డ్యాన్సర్ అవుదామని జాబ్ వదిలేసి కన్నడ సినీ పరిశ్రమలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో డ్యాన్సర్ గా పనిచేస్తూనే నటుడిగా చిన్న చిన్న పాత్రలు రావడంతో కన్నడ సినిమాలు, సీరియల్స్ లో మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత కన్నడలో సీరియల్స్ చేసిన నిఖిల్ కి తెలుగులో గోరింటాకు సీరియల్ లో మెయిన్ లీడ్ అవకాశం వచ్చింది. ఈ సీరియల్ మంచి హిట్ అయి నిఖిల్ కి తెలుగులో పాపులారిటీ తెచ్చింది. ఆ తర్వాత తెలుగులో స్రవంతి, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్స్ తో పాటు టీవీ షోలతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు విన్నర్ గా నిలిచాడు. మరి బిగ్ బాస్ తర్వాత నిఖిల్ సీరియల్స్ లో కంటిన్యూ అవుతాడా, సినిమాలు చేస్తాడా చూడాలి.