Divvela Madhuri
Divvela Madhuri : తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి దివ్వెల మాధురి ఇటీవల వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చింది. మూడు వారాలు మాత్రమే హౌస్ లో ఉన్నా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే సడెన్ గా ఎంట్రీ ఇచ్చినట్టే సడెన్ గా ఎలిమినేట్ అయిపోయారు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ నుంచి దివ్వెల మాధురి బయటకు వచ్చేసింది.(Divvela Madhuri)
దీంతో దివ్వెల మాధురి రెమ్యునరేషన్ చర్చగా మారింది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్లలో ఈ సీజన్ లో ఎక్కువగా రెమ్యునరేషన్ ఇచ్చింది దివ్వెల మాధురి కే అని సమాచారం. వారానికి మూడు లక్షల చొప్పున మూడు వారాలకు దాదాపు 9 లక్షల రూపాయలు దివ్వెల మాధురికి బిగ్ బాస్ నుంచి రెమ్యునరేషన్ రూపంలో వచ్చినట్టు సమాచారం.
Also Read : Sudheer Babu : అయ్యో.. ఇప్పటిదాకా మహేష్ ని బావ అని పిలవలేదంట.. పిలిస్తే.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్..
గతంలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ నుంచి దివ్వెల మాధురికి వచ్చే డబ్బులు వికలాంగులకు, క్యాన్సర్ వచ్చిన వాళ్లకు, పేద ప్రజలకు ఉపయోగిస్తాం. మాకు ఎందుకు ఈ డబ్బులు. మాకు భగవంతుడు ఇచ్చింది చాలు. మేము చేసే సర్వీస్ లో ఈ డబ్బులు కూడా కలిపి చేస్తాము అని అన్నారు. దీంతో దివ్వెల మాధురి బిగ్ బాస్ ద్వారా సంపాదించింది ప్రజా సేవకు వినియోగిస్తుందని తెలుస్తుంది.