Nagarjuna
Nagarjuna : టాలీవుడ్ లో 65 ఏళ్ళు వచ్చినా ఇంకా మన్మధుడిలా కనిపిస్తూ ఏమున్నాడ్రా బాబు అనిపించేలా ఉండే హీరో మన కింగ్ నాగార్జున. ఆయనకి వయసైపోదు అనే డైలాగ్ నాగ్ కి పర్ఫెక్ట్ గా సరిపోద్ది. నాగార్జున త్వరలో రజినీకాంత్ కూలీ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రజినీకాంత్ నాగార్జున అందం, ఫిట్నెస్ గురించి తెగ పొగిడేశారు. దానికి సీక్రెట్ అడిగితే నాగార్జున కొన్ని చెప్పారట.
నాగార్జున చెప్పిన సీక్రెట్స్ ని రజినీ ప్రమోషన్స్ లో చెప్పేసారు. అలాగే నాగార్జున కూడా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫిట్నెస్ సీక్రెట్స్ చెప్పారు. నాగార్జున, రజినీకాంత్ కలిసి నాగ్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏం చెప్పారో తెలుసా?
Also Read : Tribanadhari Barbarik : ఉదయభాను రీ ఎంట్రీ సినిమా.. మెగాస్టార్ పుట్టిన రోజు నాడు రిలీజ్..
నాగార్జున అందానికి, ఫిట్నెస్ కి సీక్రెట్స్ ఇవే..
రోజూ 45 నిమిషాల నుంచి గంట వరకు కచ్చితంగా వ్యాయామం.
రోజూ ఒకే టైపు వ్యాయామం కాకుండా ఓ రోజు బరువులు ఎత్తడం, ఒక రోజు థ్రెడ్ మిల్ పై పరిగెత్తడం, ఇంకోరోజు స్విమ్మింగ్, ఒక రోజు వాకింగ్.. ఇలా అన్ని కవర్ అయ్యేలా చేయడం.
వ్యాయామం చేసేటప్పుడు ఫోన్ వాడకపోవడం, మధ్యలో బ్రేక్స్ తీసుకోకపోవడం.
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేయడం. అంటే రోజులో ఏం తిన్నా 12 గంటల్లోనే తింటారు. మరో 12 గంటలు ఉపవాసమే.
ఉదయం పూట కిమ్చి, ఉడికించిన క్యాబేజి, బ్రొకోలి, కొన్ని కూరగాయ ముక్కలు, గోరువెచ్చని నీళ్లు, కాఫీ తాగుతారు.
Also Read : Sridevi : శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్న రజినీకాంత్.. కమల్ కిఇచ్చి పెళ్లి చేయాలనుకున్న శ్రీదేవి తల్లి..
మధ్యాహ్నం అందరిలాగేన్ భోజనం, అందులో పప్పు, కూర, పచ్చడి, నాన్ వెజ్ అన్ని ఉండేలా చూసుకుంటారు.
రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్యలో డిన్నర్ పూర్తి చేస్తారు. అందులో సలాడ్స్, చికెన్ లేదా ఫిష్ తింటారు.
అయితే నాగార్జునకు స్వీట్స్ అంటే ఇష్టం. కానీ అవి తినకూడదు. దాంతో రాత్రి పూట ఒక్కోసారి ఏదైనా స్వీట్, డిజర్ట్ తిని ఉదయం అది కరిగేంతలా వర్కౌట్స్ చేస్తారట.
రాత్రి త్వరగా పడుకోవడం. ప్రశాంతమైన నిద్ర. రాత్రి షూటింగ్స్, ఈవెంట్స్ వల్ల లేట్ అయితే తప్ప రోజూ ఒకే టైంకి పడుకుంటారు.
అలాగే తండ్రి చెప్పిన సలహా.. సెలబ్రిటీల విషయంలో అన్ని రకాలుగా ఒత్తిడి ఉంటుంది. బయట విషయాల గురించి, అక్కర్లేని విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు అనేది పాటిస్తారట. ఇలా ఇవన్నీ పాటించి నాగార్జున ఇంకా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు కూడా ఇవి పాటించి మీ హెల్త్ ని ఫిట్ చేసుకోండి.
Also Read : Nagarjuna : ఫస్ట్ టైం కెరీర్ లో కథ చెప్తే రికార్డ్ చేసుకున్నా.. కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింగ్ కామెంట్స్..