Tribanadhari Barbarik : ఉదయభాను రీ ఎంట్రీ సినిమా.. మెగాస్టార్ పుట్టిన రోజు నాడు రిలీజ్..

ఒకప్పటి స్టార్ యాంకర్, నటి ఉదయభాను ఈ సినిమాతో మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది.

Tribanadhari Barbarik : ఉదయభాను రీ ఎంట్రీ సినిమా.. మెగాస్టార్ పుట్టిన రోజు నాడు రిలీజ్..

Tribanadhari Barbarik

Updated On : August 6, 2025 / 7:02 AM IST

Tribanadhari Barbarik : డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మాణంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒకప్పటి స్టార్ యాంకర్, నటి ఉదయభాను ఈ సినిమాతో మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది.

భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరికుడు పాత్రను ఆధారంగా తీసుకుని ప్రస్తుత కథకు, మైథలాజి టచ్ ఇస్తూ ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవేయి పుట్టిన రోజు ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Also Read : Sridevi : శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్న రజినీకాంత్.. కమల్ కిఇచ్చి పెళ్లి చేయాలనుకున్న శ్రీదేవి తల్లి..

రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రెస్ మీట్ లో సత్య రాజ్ మాట్లాడుతూ.. ఇందులో కథే మెయిన్ హీరో. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ వీళ్లే అసలైన బాణాలు. ఈశ్వర్ గారు నాతో డ్యాన్స్ చేయించారు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. కెమెరా యాంగిల్‌తోనే సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు. 70 ఏళ్లు దాటినా కూడా నేను కొత్త కొత్త పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. నా డియర్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆయన పుట్టిన రోజున రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది అని అన్నారు.

ఉదయ భాను మాట్లాడుతూ.. నేనేమీ సినిమాలకు దూరంగా లేను. నాకు నచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తున్నాను. ఆర్టిస్టులకు ఉండే ఆకలిని తీర్చే పాత్రలో ప్రస్తుతం నటించాను. ‘బార్బిరిక్’ సినిమాలో ఓ ఛాలెంజింగ్ పాత్ర చేశాను. మన భాషలో ఇలాంటి సినిమాలు ఎందుకు రావు అని అంతా అంటుంటారు. అలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా మా సినిమా ఉంటుంది అని అన్నారు.

Tribanadhari Barbarik

నటుడు వశిష్ట ఎన్ సింహా మాట్లాడుతూ.. మోహన్ గారు చెప్పిన కథ విన్నప్పుడే టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. నన్ను ఈ మూవీలో చాలా కొత్తగా చూపించారు. నేను కూడా చిరంజీవి గారి అభిమానినే. ఆయన బర్త్ డే రోజు రిలీజ్ కాబోతుండటం ఆనందంగా ఉంది అన్నారు.

నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదెల మాట్లాడుతూ.. మా మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి అని అన్నారు. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. నీ వల్లే నీ వల్లే.. అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే మొదటి బాణం. అనగా అనగా.. అనే పాట రెండో బాణం. ఇస్కితడి ఉస్కితడి.. అంటూ మూడో బాణాన్ని వదిలాం. విజయ్‌ పాల్ రెడ్డి గారు క్లారిటీతో డబ్బులు పెట్టారు. కమిట్మెంట్‌తో నేను ఈ సినిమా చేశాను. మా బాస్ మెగాస్టార్ బర్త్ డే రోజు రిలీజ్ చేయబోతోన్నాం అని తెలిపారు.

Also Read : Chiranjeevi : టాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్.. మెగాస్టార్ తో నిర్మాతల భేటీ.. చిరంజీవి ఏమన్నారంటే..