Vishwak Sen : మూడు నెలలు తిప్పించుకున్నారు.. రెండు రోజులు ఏడ్చాను.. నాకే ఎందుకు ఇలా.. విశ్వక్ కెరీర్ స్టార్టింగ్ కష్టాలు..

లైలా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ కష్టాలు గురించి తెలిపాడు.

vishwak sen

Vishwak Sen : యువ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. విశ్వక్ కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్, నిర్మాత, లిరిక్ రైటర్, రైటర్.. ఇలా అన్ని విభాగాల్లోనూ సక్సెస్ అయ్యాడు. విశ్వక్ హీరోగా నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14 రిలీజ్ కానుంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైలా సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

లైలా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ కష్టాలు గురించి తెలిపాడు. విశ్వక్ మొదట్నుంచి కూడా సినిమా ప్రయత్నాలే చేసాడు. స్కూల్ లెవల్లోనే ఎడిటింగ్ నేర్చుకున్నాడు. కాలేజీ సమయంలో ఆడిషన్స్ ఇచ్చాడు. మాస్ కమ్యూనికేషన్స్ చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. విశ్వక్ హీరోగా చేసిన మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే’ రిలీజ్ అవ్వడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఆ సినిమా చేసాక రిలీజ్ అవ్వకపోవడంతో ఇంకా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆడిషన్స్ ఇచ్చాడు.

Also Read : Kobali Series : ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయ్యింది.. కొత్తగా ఏదో ఒకటి చేయాలి అని ఈ సిరీస్ చేశాను..

ఇంటర్వ్యూలో విశ్వక్ మాట్లాడుతూ.. ఒక సినిమాలో హీరో వేషం అన్నారు. చాలా ఆడిషన్స్ తీసుకున్నారు. మూడు నెలలు వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగాను. రోజు ఆఫీస్ కి వెళ్లడం, ఆడిషన్ ఇవ్వడం, కథ గురించి డిస్కస్ చేయడం చేసారు. అనుకోకుండా హీరో నుంచి తీసేసి సెకండ్ హీరో అన్నారు, ఓకే ఆనుకోని అప్పుడు కూడా ఆఫీస్ కి వెళ్ళేవాడిని. చెప్పకుండా ఒక రోజు ఆఫీస్ కి వెళ్లనందుకు ఆ డైరెక్టర్ హర్ట్ అయి సినిమాలో హీరో తర్వాత నాలుగో పాత్ర ఇచ్చారు. సరే అయినా ఏదో ఒక అవకాశం కావాలి అనుకున్నా. ఆ తర్వాత 20 రోజులకు నా క్యారెక్టర్ తీసేశారని తెలిసింది. నా క్యారెక్టర్ తీసేసినా ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్నారు, నాతో పనులు చేయించుకున్నారు. ఆ దెబ్బకి ఇంట్లో కూర్చొని రెండు రోజులు ఏడ్చాను. అప్పటికి చేసిన వెళ్ళిపోమాకే కూడా రిలీజ్ అవ్వట్లేదు. నాకే ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడ్డాను.

Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ బాడీ గార్డ్ గురించి తెలుసా? 7 అడుగులు ఎత్తు.. అతన్ని దాటి విశ్వక్ ని టచ్ చేయలేరు.. జీతం ఎంతో తెలుసా?

అలా రెండు రోజులు ఏడ్చి మూడో రోజు అంగమలై డైరీస్ సినిమా చూసి దాన్ని రీమేక్ చేద్దామని మా నాన్నకు చెప్తే, మా నాన్న మా మామను పిలిచి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, ఆ చెత్త సినిమా చేస్తాడంట అని అన్నాడు. నేను వాళ్ళిద్దరికీ ఆ సినిమా పెట్టి మ్యూట్ లో పెట్టి తెలుగు డబ్బింగ్ చెప్పగానే వాళ్ళు షాక్ అయి ఓకే చెప్పారు. 11 లక్షలు పెట్టి ఆ సినిమా డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్నాను. అప్పుడే దినేష్ నాయుడు అనే పేరు కలిసి రావట్లేదు అని విశ్వక్ సేన్ అని మార్చారు. పేరు మార్చుకున్నాక రెండు వారాల్లో వెళ్ళిపోమాకే రిలీజ్ అయింది. మూడో వారంలో ఈ నగరానికి ఏమైంది ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఫలక్ నామా దాస్ సినిమా డైరెక్టర్ గా చేసాను. ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా మా నాన్న దగ్గర రోజూ 500 పాకెట్ మనీ తీసుకునేవాడిని అని తెలిపారు.