Kobali Series : ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయ్యింది.. కొత్తగా ఏదో ఒకటి చేయాలి అని ఈ సిరీస్ చేశాను..
కోబలి సిరీస్ హిట్ అవ్వడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

Ravi Prakash Interesting Comments in Kobali Web Series Success Meet
Kobali Series : నింబస్ ఫిలిమ్స్, యు1 ప్రొడక్షన్స్, టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావులు సంయుక్తంగా నిర్మించిన రా అండ్ రస్టిక్ వెబ్ సిరీస్ ‘కోబలి’. రేవంత్ లేవాక దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇటీవల ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. రవి ప్రకాష్, రాకీ సింగ్, వెంకట్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కింది. కోబలి సిరీస్ 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ మంచి విజయం సాధించింది.
కోబలి సిరీస్ హిట్ అవ్వడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ ఈవెంట్లో నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయ్యింది. కొత్తగా ఏదో ఒకటి చేయాలి అనే కోబలి చేశాను. ఒక కాఫీ షాప్ లో ఈ కథ విన్నప్పుడు నాకు నచ్చింది. కానీ ఇది అందరూ కొత్తవాళ్లు కావడంతో ముందుకెళ్తుంది అని నమ్మలేదు. అయినా దీనిపై నమ్మకం పెట్టి హాట్ స్టార్ రిలీజ్ చేసి పెద్ద హిట్ సాధించింది అని తెలిపారు.
రాకీ సింగ్ మాట్లాడుతూ.. రవి ప్రకాష్ చెప్పినట్టు ఇందులో ఉన్న నటీనటులను బట్టి అమ్ముడయ్యే కంటెంట్ కాకపోయినా ప్రేక్షకులు ఆదరించారు. చిన్న పాత్ర అయినా చేయడానికి వచ్చిన వెంకట్ గారికి థ్యాంక్స్. సీజన్ 2లో మాత్రం ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుంది. అసలైన కథ సీజన్ 2లోనే ఉంటుంది అని తెలిపారు. సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ.. నిజంగానే ఇందులో అంతా కొత్తవాళ్లే. కానీ హాట్ స్టార్ మమ్మల్ని నమ్మింది. 7 భాషల్లోనూ ఇది మంచి విజయం సాధించింది. రేవంత్ నాతో కూడా ఒక సినిమా చెయ్యి. అంతకు మించి నీ హార్డ్ వర్క్ ని పొగడలేను. స్టార్లు ఉంటేనే కంటెంట్ ని ఆదరిస్తారు అనేది పాత మాట. ఇప్పుడు కంటెంట్ బాగుంటే కొత్త పాత తేడా లేదు అని అన్నారు.
నిర్మాతలు జ్యోతి, రాజశేఖర్ రెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ సిరీస్ ని యాక్సెప్ట్ చేసిన హాట్ స్టార్ కి, ఆదరించిన ప్రేక్షకులకి ధన్యవాదాలు. కోబలి మేము అనుకున్న దానికంటే పెద్ద సక్సెస్ అయ్యింది. నార్త్ లో ఈ సిరీస్ కి మంచి వ్యూస్ వస్తున్నాయి. పార్ట్ 2 దీనికి మించి ఉంటుంది అని తెలిపారు. డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ.. కోబలి కి మేము అనుకున్నదానికంటే మంచి రీచ్ వచ్చింది. ఇందులో నటించిన వారికి, నిర్మాతలకు అందరికి థ్యాంక్స్ తెలిపారు.