Do You Know Interesting Facts about Vishwak Sen New Bodyguard
Vishwak Sen Bodyguard : మన సెలబ్రిటీలు తమ సెక్యూరిటీ కోసం బౌన్సర్లు ని పెట్టుకుంటారని తెలిసిందే. కొంతమంది సెలబ్రిటీలు పర్సనల్ సెక్యూరిటీని, ఎప్పుడూ పక్కనే ఉండే బాడీ గార్డ్ ని కూడా పెట్టుకుంటారు. వారికి జీతాలు కూడా భారీగానే ఉంటాయి. సెలబ్రిటీని కనిపెట్టుకొని ఉండటం, ఎవరూ ఆ సెలబ్రిటీ దగ్గరకు రాకుండా చూడటం ఆ బాడీగార్డ్స్ పని. తాజాగా విశ్వక్ సేన్ పెట్టుకున్న బాడీ గార్డ్ సినీ పరిశ్రమలో చర్చగా మారాడు.
హీరో విశ్వక్ సేన్ ఇటీవల హర్యానాకు చెందిన ఓ వ్యక్తిని బాడీ గార్డ్ గా పెట్టుకున్నారు. అతని పేరు రోతాష్ చౌదరి. 7 అడుగులు ఎత్తు ఉంటాడు. విశ్వక్ సేన్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించబడ్డాడు. గతంలో సల్మాన్ ఖాన్ దగ్గర కూడా సెక్యూరిటీ గా పనిచేసిన అనుభవం ఇతనికి ఉంది. ఇతని జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విశ్వక్ ఈ బాడీ గార్డ్ కి అక్షరాలా నెలకు 2 లక్షల జీతం ఇస్తున్నాడంట. అంతే కాకుండా ఇతనికి ఓ ఇల్లు ఇచ్చి, వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తున్నాడు అంట విశ్వక్ సేన్.
ఇటీవల గత కొద్దిరోజులుగా విశ్వక్ ఎక్కడికి వెళ్లినా వెనకే ఉంటున్నాడు ఈ బాడీ గార్డ్ రోతాష్. విశ్వక్ ని ఓ కంట కనిపెట్టుకొని ఉండటమే ఇతని పని, ఎవరూ కూడా విశ్వక్ దగ్గరికి ఇతన్ని దాటి వెళ్ళలేరు. ముఖ్యంగా కొంతమంది ఫ్యాన్స్ అతి చేసి సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇతన్ని చూసి జంకుతున్నారంట. ఇక విశ్వక్ ఇంత భారీకాయం ఉన్న వ్యక్తిని బాడీగార్డ్ గా పెట్టుకోవడంతో సినీ పరిశ్రమలో చర్చగా మారింది. ఏ ఈవెంట్ కి వెళ్లినా, బయట ఎక్కడికి వెళ్లినా అందరూ విశ్వక్ బాడీ గార్డ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
Also Read : Find The Actor : ఈ ఫొటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? ఒకప్పుడు అమ్మాయిల ఫేవరేట్ హీరో.. ఇప్పుడు మాత్రం విలన్..
ఇక విశ్వక్ సేన్ గత సినిమా మెకానిక్ రాకీ యావరేజ్ గా నిలవగా ఇప్పుడు లైలా సినిమాతో రాబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైలా సినిమా ఫిబ్రవరి 14న రానుంది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.