Find The Actor : ఈ ఫొటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? ఒకప్పుడు అమ్మాయిల ఫేవరేట్ హీరో.. ఇప్పుడు మాత్రం విలన్..

ఇంతకీ ఈ ఫొటోలో ఉన్నది ఎవరో అనుకుంటున్నారా?

Find The Actor : ఈ ఫొటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? ఒకప్పుడు అమ్మాయిల ఫేవరేట్ హీరో.. ఇప్పుడు మాత్రం విలన్..

Find The Childhood Photo of a Star Actor in this Photo Here Details

Updated On : February 13, 2025 / 12:37 PM IST

Find The Actor : అప్పుడప్పుడు మన సినీ సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. సినీ ప్రముఖులు వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సీనియర్ నటుడు తన చిన్నప్పటి ఫొటోలతో చేసిన ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Find The Childhood Photo of a Star Actor in this Photo Here Details

Also Read : Mohan Babu : మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. ఆ కేసులో ముందస్తు బెయిల్..

ఇంతకీ ఈ ఫొటోలో ఉన్నది ఎవరో అనుకుంటున్నారా? ఈ ఫొటోలో ఉన్న చిన్నబాబు ఒకప్పుడు అమ్మాయిల మనసులను దోచుకున్న హీరో, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన హీరో జగపతి బాబు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతి బాబు లెజెండ్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటోలు అన్ని కలిపి ఓ చిన్న వీడియో చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు జగపతి బాబు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి..

View this post on Instagram

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

స్టార్ నిర్మాత VB రాజేంద్రప్రసాద్ కొడుకుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమా చేసి సింహస్వప్నం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నో లవ్ స్టోరీలు, కామెడీ సినిమాలతో అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఒకానొక సమయంలో వరుస హిట్స్ అందుకొని అమ్మాయిలకు ఫేవరేట్ హీరో అయిపోయాడు. కానీ ఏజ్ పెరగడం, మధ్యలో హీరోగా కొన్ని వరుస ఫ్లాప్స్ చూడటంతో చిన్న బ్రేక్ తీసుకొని బాలయ్య లెజెండ్ సినిమాలో విలన్ గా తనలోని నెగిటివ్ షేడ్ ని చూపించి అదరగొట్టారు. జగపతి బాబుని విలన్ గా చూడటంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ పాత్ర సక్సెస్ అవ్వడంతో అప్పట్నుంచి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయ్యారు జగపతి బాబు.

Also Read : Prabhas : ‘ఫౌజీ’ షూట్ నుంచి ప్రభాస్ ఫోటోలు రివీల్ చేసిన బాలీవుడ్ స్టార్.. రెబల్ స్టార్ లుక్ అదిరిందిగా..

ఇటీవలే పుష్ప 2 సినిమాలో రాజకీయ నేతగా కనిపించి మెప్పించారు. ఒకానొక సమయంలో జగపతి బాబు తన ఆస్తి అంతా పోగొట్టుకొని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అయి సంపాదించుకున్నారు. జగపతి బాబుకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒకరికి పెళ్లి అయిపొయింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ 63 ఏళ్ళ వయసులో కూడా పర్ఫెక్ట్ హెల్త్, బాడీతో సినిమాల్లో కష్టపడుతున్నారు జగ్గు భాయ్.

Find The Childhood Photo of a Star Actor in this Photo Here Details