Thandel : బాక్సాఫీస్ వ‌ద్ద‌ ‘తండేల్’ క‌లెక్ష‌న్ల వ‌ర్షం.. వ‌డివ‌డిగా 100 కోట్ల వైపు అడుగులు..

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తండేల్ చిత్రం వంద కోట్ల దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది.

Thandel movie four days Collections

అక్కినేని నాగ చైత‌న్య, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మూవీ తండేల్‌. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ల‌వ్‌, యాక్ష‌న్‌, దేశ‌భ‌క్తి బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

విడుద‌లైన నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.73.20 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌య‌న్ని చిత్ర బృందం అధికారికంగా వెల్ల‌డించింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను సైతం సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.

Megastar Chiranjeevi : అనిల్ రావిపూడితో చిరంజీవి మూవీ ఫిక్స్‌.. ఏ జాన‌రో తెలుసా?

దీంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్ర‌స్తుతం చిత్ర బృందం కూడా య‌మా ఖుషీగా ఉంది. మ‌రో రెండు మూడు రోజుల్లో ఈ చిత్రం ఈజీగా 100 కోట్ల క‌బ్‌లో చేరుతుంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఈ చిత్రం విడుద‌లైన మొద‌టి రోజే రూ.21.27 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. అక్కినేని నాగ‌చైత‌న్య సినీ కెరీర్‌లో తొలి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది.

BoycottLaila : 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్.. బాయ్ కాట్ లైలా ట్రెండింగ్… రంగంలోకి హీరో

ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య న‌ట‌న అదుర్స్ అనిపించేలా ఉంది. రాజు, స‌త్య పాత్ర‌ల్లో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విలు జీవించేశార‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు. ఎమోష‌న్ల సీన్ల‌లో అయితే చైతు కంట‌త‌డి పెట్టించేశాడ‌ని కొనియాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని జాల‌ర్ల జీవితంలో జ‌రిగిన య‌దార్థ గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.