Thandel Back Story : ఆ పాకిస్థాన్ కానిస్టేబుల్ అల్లు అర్జున్ అభిమానా? ‘తండేల్’ సినిమాగా రావడానికి కారణం ఇదా?

తండేల్ సినిమా రియల్ కథ అని అందరికి తెలిసిందే.

Do You Know Thandel Back Real Story Due To Pakisthan Allu Arjun Fan

Thandel Back Story : నాగచైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా నిన్న ఫిబ్రవరి 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. తండేల్ సినిమా మొదటి రోజే 21 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ ఓపెనింగ్స్ సాధించింది. అయితే తండేల్ సినిమా రియల్ కథ అని అందరికి తెలిసిందే.

ఏపీకి చెందిన కొంతమంది మత్స్యకారులు గుజరాత్ లో సముద్రంలోకి వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లో చిక్కుకోవడంతో అరెస్ట్ అయి పాకిస్థాన్ జైలు లో ఉండి బయటకు వచ్చిన రియల్ కథకు ఓ ప్రేమ కథ జోడించి తండేల్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే అసలు తండేల్ కథ మొదలవ్వడానికి కారణం అక్కడ పాకిస్థాన్ కానిస్టేబుల్ ఒకరు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ అడగడమే అంట.

Also Read : Thandel : అల్లు అర్జున్ చెప్పిన సలహాతో తండేల్ సూపర్ హిట్..

పాకిస్థాన్ కరాచీ జైలులో ఉన్న సమయంలో మన దేశ జాలరులకు ఆ జైలులోని ఒక కానిస్టేబుల్ కాస్త హెల్ప్ చేస్తాడు. సినిమాలో కూడా ఈ సీన్ ఉంటుంది. అయితే ఆ జాలరులు రిలీజ్ అవుతున్న సమయంలో ఆ కానిస్టేబుల్ వీరి నుండి ఒక ఫేవర్ అడిగారు. మీ దేశంలోని హీరో అల్లు అర్జున్ నాకు ఇష్టం. నేను ఆయన అభిమానిని. నాకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలి. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని నాకు పంపించండి అని అడిగారట. భారతదేశానికి తిరిగి వచ్చిన జాలరులు తండేల్ రచయిత, సినీ పరిశ్రమ వ్యక్తి కార్తీక్ కి ఈ విషయం చెప్పడంతో అతను నిర్మాత బన్నీ వాసుకు చెప్పాడు.

Also Read : Raviteja : క్లాస్ డైరెక్టర్ చేతిలో మాస్ మహారాజ్.. రవితేజ నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనేనా?

బన్నీ వాసుకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం జరిగిన కథ చెప్పడంతో ఈ కథపై ఆసక్తి కలిగిన బన్నీ వాసు పూర్తి కథను తెలుసుకొని, దీనిని అందరికి తెలియాలని ఇలా తండేల్ రూపంలో తీసుకొచ్చారు. అలా బన్నీ ఫ్యాన్ అయిన కరాచీ జైలులోని ఒక కానిస్టేబుల్ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ అడగడంతో మొదలై చివరకు ఆ కథ అంతా తండేల్ గా మారింది అని సమాచారం.