Raviteja : క్లాస్ డైరెక్టర్ చేతిలో మాస్ మహారాజ్.. రవితేజ నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనేనా?

తాజాగా రవితేజ ఓ కొత్త సినిమా ఓకే చేసాడని సమాచారం. మాస్ హీరో క్లాస్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడని తెలుస్తుంది.

Raviteja : క్లాస్ డైరెక్టర్ చేతిలో మాస్ మహారాజ్.. రవితేజ నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనేనా?

Mass Maharaj Raviteja said ok to Class Director Kishore Tirumala after Mass Jathara Movie

Updated On : February 8, 2025 / 6:15 PM IST

Raviteja : మాస్ మహారాజ రవితేజ మొన్నటిదాకా వరుసగా సినిమాలు లైన్లో పెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసారు. మొన్నటిదాకా చేతిలో కనీసం మూడు నాలుగు సినిమాలు మెయింటైన్ చేసిన రవితేజ ఒక్కసారిగా చేతిలో ఒక్క సినిమా కుడా లేకపోవడం ఆశ్చర్యం. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాతో రాబోతున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవితేజ 75వ సినిమాగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా సమ్మర్ కి రిలీజ్ కానుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ చేతిలో ఇంకేం సినిమాలు లేకపోవడం ఆశ్చర్యం. తాజాగా రవితేజ ఓ కొత్త సినిమా ఓకే చేసాడని సమాచారం. మాస్ హీరో క్లాస్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడని తెలుస్తుంది.

Also Read : Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్భరిక్ నుంచి సిద్ శ్రీరామ్ ‘నీవల్లే సాంగ్ రిలీజ్..

నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ.. లాంటి క్లాస్ హిట్ సినిమాలు తీసిన కిషోర్ తిరుమలకు రవితేజ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ టాక్. ఇప్పటికే కిషోర్ తిరుమల రవితేజను కలిసి కథ చెప్పినట్టు, రవితేజ ఓకే చేసినట్టు తెలుస్తుంది. మాస్ జాతర సినిమా రిలీజ్ అయ్యాక కిషోర్ తిరుమల మొదలుపెడతారని, ఆల్రెడీ కిషోర్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారని వినిపిస్తుంది. మరి మాస్ హీరో రవితేజ క్లాస్ లవ్ స్టోరీలు తీసే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.

Also Read : Thandel Collections : తండేల్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌..

గతంలో కిషోర్ రవితేజ చేసిన పవర్ సినిమాకు రచయితగా పనిచేసారు. ఆ సినిమా నుంచి వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది. రవితేజ ఒక క్లాస్ స్టోరీలో కనిపించి చాలా రోజులైంది. కిషోర్ సినిమా అనగానే ఫ్యాన్స్ రవితేజ నుంచి క్లాస్ లవ్ స్టోరీ ఆశిస్తున్నారు. కిషోర్ తిరుమల చివరగా ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాతో పలకరించారు. ఇక రవితేజ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి మాస్ జాతరతో హిట్ కొట్టి కిషోర్ సినిమాతో ఆ హిట్ కంటిన్యూ చేస్తారా రవితేజ చూడాలి.

Mass Maharaj Raviteja said ok to Class Director Kishore Tirumala after Mass Jathara Movie