Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్భరిక్ నుంచి సిద్ శ్రీరామ్ ‘నీవల్లే సాంగ్ రిలీజ్..
త్రిభాణదారి బార్బరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన నీవల్లే పాటను విడుదల చేశారు.

Neevalle Lyrical Video out now from Tribanadhari Barbarik
వశిష్ట సింహ, సత్యరాజ్, సత్యం రాజేశ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ త్రిభాణదారి బార్బరిక్. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ చిత్రం తెరకక్కుతోంది. స్టార్ దర్శకుడు మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి నీవల్లే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. రఘురాం లిరిక్స్ అందించగా ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు.
Lavanya : వాటి కోసమే మస్తాన్ సాయి ఇంటికి వెళ్లింది.. లావణ్య నాయవాది కామెంట్స్..
ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతాన్ని అందించింది. పాటలోని సీన్స్ చూస్తుంటే యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూరైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోంది.