Thandel : అల్లు అర్జున్ చెప్పిన సలహాతో తండేల్ సూపర్ హిట్..

తండేల్ విజ‌యంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు కొంత క్రెడిట్ ద‌క్కుతుంద‌ని అల్లు అర‌వింద్ చెప్పారు.

Thandel : అల్లు అర్జున్ చెప్పిన సలహాతో తండేల్ సూపర్ హిట్..

Allu Arjun Suggestion Worked for Thandel Movie Hit Know the Reason

Updated On : February 8, 2025 / 6:15 PM IST

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా న‌టించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు ఈ మూవీని నిర్మించారు. శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 7) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ సూప‌ర్ హిట్ గా నిలిచింది.

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ.21.27 కోట్లు రాబ‌ట్టిన‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. కాగా.. ఈ చిత్రంలో చైత‌న్య – సాయి ప‌ల్ల‌వి కెమిస్ట్రీ అదిరిపోయింది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ఈ విష‌యాన్ని అల్లు అర‌వింద్ కూడా ఒప్పుకొన్నారు. ఒక‌వేళ దేవీ గ‌నుక తండేల్ మూవీకి సంగీతాన్ని అందివ్వ‌క‌పోతే ఈ సినిమా ఈ స్థాయిలో విజ‌యం సాధించేది కాద‌న్నారు.

Monalisa : ఫ‌స్ట్ సినిమాకి మోనాలిసా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

తండేల్ విజ‌యంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు కొంత క్రెడిట్ ఇవ్వాల‌ని చెప్పారు. అల్లు అర్జున్ చెప్ప‌డంతోనే దేవీశ్రీ ప్ర‌సాద్‌ని తీసుకున్న‌ట్లు అల్లు అర‌వింద్ తెలిపారు. తండేల్ మూవీ షూటింగ్ స‌మ‌యంలో పుష్ప 2 సినిమాతో దేవీ శ్రీ బిజీగా ఉన్నార‌ని, అంత బిజీలో తండేల్‌కు టైమ్‌ను కేటాయించ‌గ‌ల‌డా అనే సందేహం త‌న‌లో క‌లిగింద‌ని, దీంతో వేరే సంగీత ద‌ర్శ‌కుడిని తీసుకోవాల‌ని అనుకున్న‌ట్లుగా తెలిపారు.

అయితే బ‌న్నీ మాత్రం.. ల‌వ్ స్టోరీ అంటే దేవీశ్రీ ప్ర‌సాద్ ఉండాల్సిందేన‌ని చెప్ప‌డంతో తాను ఒప్పుకున్న‌ట్లుగా తెలిపారు. అది బాగా వ‌ర్క‌ట్ అయిందన్నారు.

Lavanya : వాటి కోస‌మే మ‌స్తాన్ సాయి ఇంటికి వెళ్లింది.. లావ‌ణ్య నాయ‌వాది కామెంట్స్‌..